టీడీపీ మీడియా కో-ఆర్డినేటర్‌పై చేయి చేసుకున్న సీఐ

ABN , First Publish Date - 2022-08-16T06:16:35+05:30 IST

ఎంపీ గోరంట్ల మాధవ్‌ హిందూపురం పర్యటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిం చారు. ఎంపీ మాధవ్‌ న్యూడ్‌ వీడియో హాల్‌చల్‌ అయ్యాక మొదటి సారిగా హిందూపురానికి ఆయన సోమవారం వచ్చారు

టీడీపీ మీడియా కో-ఆర్డినేటర్‌పై చేయి చేసుకున్న సీఐ
చంద్రమోహనను వాహనంలోకి తోసేస్తున్న పోలీసులు


హిందూపురం, ఆగస్టు 15: ఎంపీ గోరంట్ల మాధవ్‌ హిందూపురం పర్యటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిం చారు. ఎంపీ మాధవ్‌ న్యూడ్‌ వీడియో హాల్‌చల్‌ అయ్యాక మొదటి సారిగా హిందూపురానికి ఆయన సోమవారం వచ్చారు. చిన్నమా ర్కెట్‌లో ఎంపీ కాన్వాయిని అడ్డుకునేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు వెళ్లగా అక్కడ పోలీసులు దురుసుగా ప్రవర్తించి పక్కకు తోసేశారు. సంతేబిదునూరు గేటు వద్ద కూడా పోలీసులు అత్యుత్సాహం చూపారు. అప్‌గ్రేడ్‌ సీఐ జీటీ నాయుడు, ఎస్‌ఐ కరీం, మరికొంత మంది పోలీసులు  టీడీపీ మీడియా పార్లమెంట్‌ కో-ఆర్డినేటర్‌ చంద్రమోహన జుట్టు పట్టుకొని వాహనం వద్దకు లాక్కెళ్లారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ అయింది. 


Updated Date - 2022-08-16T06:16:35+05:30 IST