ABN MD వేమూరి రాధాకృష్ణను రిక్వెస్ట్ చేసిన సీఐడీ అధికారులు

ABN , First Publish Date - 2021-12-10T20:50:42+05:30 IST

సోదాల పేరిట రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ లక్ష్మీ నారాయణ ఇంటి వద్ద ఏపీ సీఐడీ అధికారులు ఓవర్ యాక్షన్ చేశారు.

ABN MD వేమూరి రాధాకృష్ణను రిక్వెస్ట్ చేసిన సీఐడీ అధికారులు

హైదరాబాద్: సోదాల పేరిట రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ లక్ష్మీ నారాయణ ఇంటి వద్ద ఏపీ సీఐడీ అధికారులు ఓవర్ యాక్షన్ చేశారు. ఈ విషయం తెలిసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ అక్కడికి వెళ్లారు. ఎప్పటి నుంచో తన ఆప్తమిత్రుడైన లక్ష్మీ నారాయణకు రాధాకృష్ణ ధైర్యం చెప్పారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ సీఐడీ అధికారులను లక్ష్మీ నారాయణ నిలదీశారు. అదే సమయంలో వేమూరి రాధాకృష్ణతో సీఐడీ అధికారులు మాట్లాడారు. ‘కొద్ది సేపు మీరు ఇక్కడే ఉండాలని కోరారు. మీరు ఇక్కడే ఉంటే లక్ష్మీ నారాయణ సహకరిస్తారు.. తాము ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని వెళ్లిపోతామని’ సీఐడి అధికారి కోరడంతో రాధాకృష్ణ అక్కడే కొద్దిసేపు ఉండి వెళ్లిపోయారు.

Updated Date - 2021-12-10T20:50:42+05:30 IST