సీకా కబాబ్స్‌

ABN , First Publish Date - 2020-06-13T16:30:38+05:30 IST

బంగాళదుంప - ఒకటి, క్యారెట్‌ - ఒకటి, పచ్చిబఠాణి - అరకప్పు, ఫ్రెంచ్‌బీన్స్‌ - ఐదారు, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌స్పూన్‌, మామిడికాయ పొడి -

సీకా కబాబ్స్‌

కావలసినవి: బంగాళదుంప - ఒకటి, క్యారెట్‌ - ఒకటి, పచ్చిబఠాణి - అరకప్పు, ఫ్రెంచ్‌బీన్స్‌ - ఐదారు, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌స్పూన్‌, మామిడికాయ పొడి - ఒకటేబుల్‌స్పూన్‌, ఛాట్‌మసాలా - రెండు టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి - నాలుగైదు, జున్ను - 75 గ్రాములు, ఉప్పు - తగినంత.


తయారీ: బంగాళదుంపను ఉడికించి పొట్టు తీసి, గుజ్జుగా చేసుకోవాలి. ఫ్రెంచ్‌బీన్స్‌ను కట్‌ చేయాలి. ఒకపాన్‌ తీసుకుని కాస్త వేడి అయ్యాక అల్లంవెల్లుల్లి పేస్టు వేగించాలి. తరువాత బంగాళదుంప గుజ్జు, క్యారెట్‌ ముక్కలు, పచ్చిబఠాణి, ఫ్రెంచ్‌ బీన్స్‌ వేసి కాసేపు వేగించాలి. తరువాత మామిడికాయపొడి, ఛాట్‌ మసాలా, పచ్చిమిర్చి వేసి మరో రెండు మూడు నిమిషాలు వేగనివ్వాలి. ఇప్పుడు జున్ను వేసి కలియబెట్టాలి. తగినంత ఉప్పు వేసి మరోసారి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక వెడల్పాటి ప్లేట్‌లోకి తీసుకొని సమాన భాగాలుగా కట్‌ చేయాలి. ఒక్కో భాగాన్ని తీసుకుంటూ గుండ్రంగా చుట్టాలి. చిన్నమంటపై నాన్‌ స్టిక్‌ పాన్‌ పెట్టి వాటిని గుండ్రంగా తిప్పుకుంటూ అన్ని వైపులా సమంగా కాల్చాలి. చట్నీతో తింటే ఈ కబాబ్స్‌ టేస్ట్‌ సూపర్‌గా ఉంటుంది.

Updated Date - 2020-06-13T16:30:38+05:30 IST