బొమ్మూరు నేక్ భవనంలో జరుగుతున్న సీలింగ్ పనులు
బొమ్మూరు నేక్ భవనంలో వేగంగా సుందరీకరణ
రాజమహేంద్రవరం (ఆంధ్రజ్యోతి), మార్చి 22: ఉగాది నుంచి కొత్త జిల్లాల పాలన ప్రారంభం కానుండడంతో రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పడనున్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ ముస్తాబవుతోంది. బొమ్మూరులోని నేక్ భవనం పై అంతస్తులో కలెక్టర్ చాంబర్‌తోపాటు, జేసీల చాంబర్లు, డీఆర్ వో చాంబర్లతోపాటు సుమారు 8 సెక్షన్లు ఏర్పాటు చేయనున్నారు. ముందుగా కలెక్టర్ చాంబర్‌ను సిద్ధం చేస్తున్నారు. సీలింగ్, హాల్లో మార్పులు, చేర్పులు చేస్తున్నారు. ఈ భవనం కింద అంతస్తులో జిల్లా స్థాయి అధికారుల కార్యాలయాలు ఏర్పాటుచేయనున్నారు. రెండు మూడు రోజుల్లో కలెక్టర్ హరికిరణ్ ఇక్కడకు వచ్చి ఎవరి చాంబర్ ఏదో స్పష్టం చేయనున్న ట్టు అధికారుల సమాచారం. ఆర్అండ్బీ అధికారులు ఇక్కడ రిపేర్లు, ఇతర ముస్తాబు పనులు వేగవంతం చేశారు.