సహాయనటిపై అత్యాచార యత్నం

ABN , First Publish Date - 2022-06-14T15:20:36+05:30 IST

ఫొటోషూట్‌ పేరుతో సహాయనటిపై అత్యాచారయత్నానికి పాల్పడిన కెమెరామెన్‌ కాశీనాథన్‌ (42)ను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక కొడుంగయూరు

సహాయనటిపై అత్యాచార యత్నం

                                - కెమెరామెన్‌ అరెస్టు


చెన్నై, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): ఫొటోషూట్‌ పేరుతో సహాయనటిపై అత్యాచారయత్నానికి పాల్పడిన కెమెరామెన్‌ కాశీనాథన్‌ (42)ను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక కొడుంగయూరు ప్రాంతంలో నివసిస్తున్న 22 ఏళ్ళ యువతి టీవీ సీరియల్స్‌లో నటిస్తోంది. ఇటీవల వలసరవాక్కం ఓంశక్తినగర్‌కు చెందిన కెమెరామెన్‌ కాశీనాథన్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ సందర్భంగా తనకు పలువురు డైరెక్టర్లతో పరిచయం ఉందని, హీరోయిన్‌గా చేస్తానని కాశినాధన్‌ ఆమెకు తెలిపాడు. ఆ మేరకు  ఆదివారం రాత్రి తన ఇంటికి వస్తే ఫొటోషూట్‌ జరుపుతానని చెప్పాడు. కాశీనాథన్‌ మాటలను నమ్మి ఆ యువతి అతడి ఇంటికి వెళ్ళింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న కాశీనాథన్‌పై ఆమె అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో దిగ్ర్భాంతి చెందిన ఆ యువతి తప్పించుకుని ఇంటికి చేరుకుంది. సోమవారం ఉదయం ఆమె వలసరవాక్కం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కాశీనాథన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Updated Date - 2022-06-14T15:20:36+05:30 IST