ఫండ్‌ రైజింగ్‌లో సినీ దంపతులు

Jun 10 2021 @ 19:17PM

కోలీవుడ్: కరోనా వైరస్‌ దేశాన్ని పట్టిపీడిస్తోంది. ఈ వైరస్‌ సోకి అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అనేకమంది కరోనా బాధితులకు సరైన వైద్య సదుపాయాలు అందడం లేదు. ఈ నేపథ్యంలో అనేకమంది సెలెబ్రిటీలు ముందుకు వచ్చి తమవంతు సాయంగా వివిధ రకాలైన వస్తుసామాగ్రిని అందిస్తున్నారు. ఇలాంటి వారిలో అమిత్‌ భార్గవ్‌ - శ్రీరంజని దంపతులు కూడా ఉన్నారు. కావేరీ డెల్టా ప్రాంతమైన తంజావూరు పరిసర ప్రాంతాల్లోని ఆస్పత్రులకు వీరు తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నారు. ఇందుకోసం నిధుల సమీకరణ (ఫండ్‌ రైజింగ్‌)కు పూనుకున్నారు. ఇప్పటికే రెండు లక్షల రూపాయల వరకు సమీకరించారు. ఈ నిధులతో పలు ఆస్పత్రులకు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను అందజేస్తున్నారు. వీరికి తంజావూరుకు చెందిన ప్రముఖ పర్యావరణ పరిరక్షకుడు నిమల్‌ రాఘవన్‌ తన వంతు సహకారం అందిస్తున్నారు. 


2018 సంవత్సరం నుంచి అనేక మంది వ్యవసాయ కూలీలకు వివిధ రకాలైన సాయాలను అందజేస్తూ వస్తున్న నిమల్‌ రాఘవన్‌... కోవిడ్‌ తొలి దశ వ్యాప్తి సమయంలో దాదాపుగా 4 వేల కుటుంబాలకు ఆహారంతో పాటు ఇతర నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈయన సహకారంతో ఫండ్‌ రైజింగ్‌ను చేపట్టి.. అమిత్‌ దంపతులు ఇప్పటికే వానే సేకరించిన నిధులతో 5 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్స్‌ను కొనుగోలు చేసి వాటిని పట్టుకోట, పేరావూరణి, ఆరంతాంగి, ఆళంగుడి ఆస్పత్రులకు అందజేశారు. అంతేకాకుండా, తంజావూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న కరోనా బాధితుల ప్రాణాలను కాపాడేందుకు మరో 16 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు కావాల్సి ఉందన్నారు. అందువల్ల తమకు ఎవరికి తోచిన సాయం వారు చేయాలని ప్రాధేయపడుతున్నారు. కాగా, అమిత్‌ భార్గవ్‌... జీ తమిళం చానెల్‌లో పలు ప్రాజెక్టులను చేస్తుండగా, శ్రీరంజని తమిళ సినీ పరిశ్రమలో గాయనిగా, వ్యాఖ్యాతగా, ఆర్టిస్టుగా రాణిస్తున్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.