సినీ దర్శకుడు మణిశేఖరన్‌ కన్నుమూత

Nov 19 2021 @ 11:24AM

అడయార్‌(చెన్నై): ప్రముఖ రచయిత, సినీ దర్శకుడు, కలైమామణి కె.వి.మణిశేఖరన్‌ (94) గురువారం వృద్ధాప్యం కారణంగా కన్నుమూశారు. ఈయన గత 1992లో తమిళ భాషకు కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని అందుకున్నారు. గత 50 యేళ్ళకుపైగా రచయితగా ఉన్న ఈయన... 8 నాటకాలు, 29 షార్ట్‌ స్టోరీస్‌ కలెక్షన్స్‌, 50 హిస్టారికల్‌ నావల్స్‌, 8 ఎస్సేలు రైటింగ్స్‌ చేశారు. దిగ్గజ దర్శకుడు దివంగత కె.బాలచందర్‌ వద్ద అసిస్టెంట్‌ దర్శకుడుగా పనిచేసిన ఈయన దర్శకత్వం వహించిన ‘తెన్నంగీట్రు’. ఈ చిత్రాన్ని తమిళం, కన్నడ భాషల్లో తెరకెక్కించగా, కర్నాటక ప్రభుత్వం అందించే నీరిక్షే అవార్డును అందుకున్నారు. ఈయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలిపారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.