Water purifiers, గ్లాసులు ఉండాల్సిందే.... సినిమా హాళ్ళకు మద్రాస్ హైకోర్టు ఆదేశం

ABN , First Publish Date - 2021-10-05T21:58:05+05:30 IST

సినిమా థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు వాటర్ బాటిళ్లు తీసుకురావడాన్ని నిషేధించడంపై మద్రాస్ హైకోర్టు కీలక

Water purifiers, గ్లాసులు ఉండాల్సిందే.... సినిమా హాళ్ళకు మద్రాస్ హైకోర్టు ఆదేశం

చెన్నై: సినిమా థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు వాటర్ బాటిళ్లు తీసుకురావడాన్ని నిషేధించడంపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రేక్షకులు వాటర్ బాటిళ్లు తీసుకురాకుండా ఉండాలంటే తొలుత ఉచితంగా పూర్తి శుభ్రమైన తాగునీరును అందించాల్సిందేనని స్పష్టం చేసింది. ‘ఎస్ 2 సినిమాస్’లో వాటర్ బాటిల్, జ్యూస్‌లపై ఎమ్మార్పీ కంటే అధికంగా వసూలు చేస్తున్నారంటూ 2016లో జి. దేవరాజన్ అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.  


ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. భద్రతాపరమైన కారణాలతో ఇలాంటి నిషేధం విధించడానికి ముందు థియేటర్లలో తప్పకుండా ఉచితంగా పూర్తిగా శుద్ధిచేసిన తాగునీటిని వాటర్ కూలర్ల ద్వారా అందించాల్సి ఉంటుందని పేర్కొంది. థియేటర్లలో అన్ని వేళలా తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలని హైకోర్టు ఆదేశించింది.


వాటర్ కూలర్లతో కలిపి వాటర్ ప్యూరిఫైర్లను థియేటర్లలో ఇన్‌స్టాల్ చేయాలని ఆదేశించింది. అలాగే, వాటిపక్కనే సరిపడా డిస్పోజబుల్ గ్లాసులను అందుబాటులో ఉంచాలని పేర్కొంది. 


ఇంటర్వెల్ సమయంలో సహా సినిమా ప్రదర్శిస్తున్నంతసేపు నీళ్లు అందుబాటులో ఉంచాలని సూచించింది. ఒకవేళ ఏదైనా కారణాలతో నీళ్లు అందుబాటులో లేకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. ఒకవేళ ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే పరిహారం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. సినిమా హాళ్లలో తాగునీటి ఏర్పాట్లు, టాయిలెట్లు తదితర వాటిని అధికారులు నిత్యం పర్యవేక్షిస్తుండాలని హైకోర్టు ఆదేశించింది. 

Updated Date - 2021-10-05T21:58:05+05:30 IST