మొక్కల సంరక్షణకు దాల్చినచెక్క

ABN , First Publish Date - 2021-01-24T06:38:15+05:30 IST

దాల్చిన చెక్క మొక్కల సంరక్షణకు, ఎరువుగానూ ఉపయోగపడుతుంది. అదెలాగంటే...

మొక్కల సంరక్షణకు దాల్చినచెక్క

  • దాల్చిన చెక్క మొక్కల సంరక్షణకు, ఎరువుగానూ ఉపయోగపడుతుంది. అదెలాగంటే...


  1. గార్డెన్‌లో చీమల బెడద ఎక్కువగా ఉంటుంది. ఇవి చెట్ల ఆకులను తినేస్తాయి. దీంతో మొక్కల ఎదుగుదల దెబ్బతింటుంది. చీమలు గుంపులుగా మొక్కలను చుట్టబెడతాయి. దీంతో మొక్కలు ఎదగకుండా నశించిపోతాయి. చీమలకు దాల్చినచెక్క వాసన పడదు. దీని ఘాటుకు చీమలు ఉక్కిరిబిక్కిరి అవుతాయి. దీంతో మొక్కలకు చీమలవల్ల హాని తగ్గుతుంది. అవి ఆరోగ్యంగా పెరుగుతాయి.
  2. ఫంగస్‌ కూడా మొక్కలను ఆరోగ్యంగా పెరగకుండా అడ్డుకుంటుంది. దాల్చినచెక్క ఈ ఫంగస్‌ను ఎంతో శక్తివంతంగా నివారిస్తుంది. దాల్చినచెక్కను మెత్తగా పొడి చేసి దానిని మొక్కలో ఫంగస్‌ ఉన్న చోట్ల చల్లాలి. ఇలా చేయడం వల్ల ఫంగస్‌ త్వరగా నాశనమై మొక్కలకు తగినంత పోషణ అంది వాటి పువ్వులు తొందరగా వికసిస్తాయి. 
  3. విత్తనాలు బాగా మొలకెత్తడానికి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫంగస్‌, పురుగుల బెడద లాంటివి విత్తనాలకు అంటకుండా ఆరోగ్యంగా అవి మొలకలెత్తేలా జాగ్రత్త వహించాలి. ప్రారంభంలోనే విపరీతమైన తేమతో మొక్కలు దెబ్బతింటాయి. దాని నుంచి వాటిని సంరక్షించాలి. విత్తనాలు ఆరోగ్యంగా మొలకెలెత్తడానికి దాల్చిన చెక్క ఎంతో ఉపయోగపడుతుంది. దాల్చినచెక్కలోని యాంటీ-ఫంగల్‌, యాంటీ-బాక్టీరియల్‌ సుగుణాలు ఎన్నో ఉన్నాయి. ఇవి విత్తనాల ఆరోగ్యకరమైన పెరుగుదలకు ఎంతో తోడ్పడతాయి.
  4. దాల్చినచెక్క వల్ల గార్డెన్‌లో దోమలు ఉండవు. ఇందుకోసం తరచూ గార్డెన్‌లో దాల్చిన చెక్క పొడిని చల్లుతుండాలి.
  5. దెబ్బతిన్న మొక్కలను దాల్చిన చెక్క కోలుకునేలా చేస్తుంది కూడా. మొక్కలపై ప్రతిరోజూ చిటికెడు దాల్చినచెక్క పొడిని చల్లితే మొక్కలు తే రుకుంటాయి.

Updated Date - 2021-01-24T06:38:15+05:30 IST