గోవాలో 'సర్కస్' టీమ్..

Jun 13 2021 @ 08:15AM

బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టికి గోవా సెంటిమెంట్ ఉంటుంది. ఆయన తెరకెక్కించే సినిమాలలో ఖచ్చితంగా ఒక్క సీన్ అయినా ఇక్కడ చిత్రీకరణ జరుపుతాడు. ఆ సెంటిమెంట్ ఆయన తాజా చిత్రం 'సర్కస్‌'కి కంటిన్యూ చేయబోతున్నాడట. రణ్ వీర్ సింగ్, పూజా హెగ్డే, జాక్విలిన్ ఫెర్నాండెజ్ కాంబినేషన్‌లో కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే ముంబైలోని ఓ స్టూడియోలో దాదాపు సినిమా టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ చేశారు. ఇక ఓ సాంగ్ కోసం అక్టోబర్, నవంబర్ నెలల్లో గోవా వెళ్ళబోతోంది చిత్ర బృందం. దర్శకుడు రోహిత్ శెట్టి హీరో రణవీర్ సింగ్, హీరోయిన్స్ పూజా హెగ్డే, జాక్విలిన్ ఈ షెడ్యూల్‌లో పాల్గొనబోతున్నారు. అంతే కాదు, 'సర్కస్'లో మరో హైలైట్ దీపికా సాంగ్. మిసెస్ రణవీర్ ( దీపిక పడుకొణ్ ) కూడా రోహిత్ శెట్టి యాక్షన్ కామెడీలో భాగం కానుంది. ఆమె మీద ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందని ఇప్పటికే దర్శకుడు చెప్పారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.