ltrScrptTheme3

"సీటిమార్": 'జ్వాలా రెడ్డి' ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

Oct 27 2021 @ 08:03AM

మ్యాచో స్టార్ గోపీచంద్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన సినిమా 'సీటీమార్'. తాజాగా ఈ మూవీ నుంచి 'జ్వాలా రెడ్డి' అనే వీడియో సాంగ్ రిలీజ్ అయింది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాను కబడ్డీ ఆట నేపథ్యంలో తెరకెక్కించారు. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న భారీ అంచనాల మధ్య విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలోని మాస్ సాంగ్ 'జ్వాలా రెడ్డి' అనే సాంగ్ మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఇక ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అయింది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.