సాయుధ పోరాటంతోనే తెలంగాణ విమోచనం

ABN , First Publish Date - 2021-09-18T05:13:47+05:30 IST

సాయుధ తిరుగుబాటుతోనే నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రాంతానికి విముక్తి లభించిందన్నది

సాయుధ పోరాటంతోనే తెలంగాణ విమోచనం
సమావేశంలో మాట్లాడుతున్న సీఐటీయూ జిల్లా కార్యాదర్శి నరసింహ

-  సీఐటీయూ జిల్లా కార్యదర్శి నరసింహ

గద్వాల టౌన్‌/ ఉండవల్లి/ అలంపూర్‌, సెప్టెం బరు 17 : సాయుధ తిరుగుబాటుతోనే నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రాంతానికి విముక్తి  లభించిందన్నది నగ్న సత్యమని సీఐటీ యూ జిల్లా కార్యదర్శి వీవీ నరసింహ అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించు కుని గురువారం గద్వాల పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో సాయుధ పోరాట వారోత్సవాలను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. సాయుధ పోరాటంలో అమరులైన వీరులకు నివాళి అర్పిం చారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామిక హక్కులను పరిరక్షించుకునేందుకు చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, దొడ్డి కొమరయ్య వంటి అమరుల స్ఫూర్తితో నిరంతర పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో ఆంజనేయులు, బాలు, రామకృష్ణ, కళ్యాణ్‌, రాము, నరసింహ, చంద్రాములు పాల్గొన్నారు. 


- ఉండవెల్లి మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట దినోత్సవం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి ఎం. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం సాగిన మహోత్తర పోరాటమని కొనియాడారు. కార్యక్రమంలో కేవీపీఎస్‌ మండల కార్యదర్శి పరశురాములు, అంజి, శేఖర్‌, వెంకటేష్‌,  జానీ, మద్దిలేటి పాల్గొన్నారు.


సాయుధ పోరాట స్ఫూర్తితో...

బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో పోరాడుదామని కేవీపీఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజు పిలుపునిచ్చారు. అలంపూర్‌ పట్టణంలోని కేవీపీఎస్‌ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవంలో ఆయన మాట్లాడారు. ఐదేళ్ల పాటు సాగిన సాయుధ రైతాంగం పోరాటంలో నిరుపేదలకు పది లక్షల ఎకరాల భూ పంపిణీ చేయగా, మూడువేల గ్రామాలను స్వయం రాజ్యాలుగా ప్రకటించారన్నా రు. ఈ పోరాటంతో ఏమాత్రం సంబంధం లేని బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్ర ను వక్రీకరించి ప్రజల మధ్య మత వైషమ్యాలను రెచ్చగొట్టేందుకు విమోచనదినాన్ని వినియోగించు కునే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. కార్య క్రమంలో ఎమేలమ్మ, బంగారు రవి, సాంబ, రాఘవేంద్రయాదవ్‌, అయ్యప్ప పాల్గొన్నారు.

Updated Date - 2021-09-18T05:13:47+05:30 IST