సిటీ బస్సులు ఫుల్‌

ABN , First Publish Date - 2022-03-06T17:44:16+05:30 IST

నగరంలో సిటీ బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. కొవిడ్‌ దెబ్బతో రెండేళ్లుగా అరకొర ప్రయాణికులతో నడిచిన ఆర్టీసీ బస్సులు రద్దీగా మారాయి.

సిటీ బస్సులు ఫుల్‌

హైదరాబాద్: నగరంలో సిటీ బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. కొవిడ్‌ దెబ్బతో రెండేళ్లుగా అరకొర ప్రయాణికులతో నడిచిన ఆర్టీసీ బస్సులు రద్దీగా మారాయి. కొవిడ్‌ ఫస్ట్‌వేవ్‌లో 20-25 శాతం నమోదయిన ప్రయాణికుల ఆక్యుపెన్సీ రెండోవేవ్‌లో 40 శాతం వరకు నమోదైంది. థర్డ్‌వేవ్‌లో 45 శాతం వరకు పెరిగినా కొవిడ్‌కేసులు పెరగడంతో ఆక్యుపెన్సీ తగ్గింది. కొన్నిరోజులుగా సాధారణ పరిస్థితులు నెలకొనడంతో కొవిడ్‌ ముందునాటి పరిస్థితులు నెలకొన్నాయి. కొవిడ్‌కు ముందు సిటీ బస్సుల్లో 65 శాతం నమోదైన ప్రయాణికులు ఆక్యుపెన్సీ ప్రస్తుతం అదే స్థాయిలో నమోదవుతుందని అధికారులు చెబుతున్నారు. రెండేళ్ల తర్వాత గ్రేటర్‌లో సిటీబస్సుల్లో ప్రయాణికులు కిక్కిరిసిపోతుండటంతో రద్దీకి అనుగుణంగా రోజు 2వేల వరకు అదనపు బస్‌ ట్రిప్పులు నడుపుతున్నారు. ప్రస్తుతం రోజుకు 25లక్షల మంది సిటీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. 

Updated Date - 2022-03-06T17:44:16+05:30 IST