City policeకు సులువుగా సెలవులు

ABN , First Publish Date - 2022-01-22T16:02:09+05:30 IST

అత్యవసర పరిస్జితుల్లో, తీవ్ర అస్వస్థత, అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు నగర పోలీసులు సెలవు పెట్టేందుకు సులభతరం చేస్తూ పోలీసుశాఖ ‘సీఎల్‌యాప్‌‘ పేరిట కొత్త మొబైల్‌ యాప్‌ను రూపొందించింది. ఈ కొత్త

City policeకు సులువుగా సెలవులు

                   -  ‘సీఎల్‌యాప్‌’ ఆవిష్కరణ


చెన్నై: అత్యవసర పరిస్జితుల్లో, తీవ్ర అస్వస్థత, అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు నగర పోలీసులు సెలవు పెట్టేందుకు సులభతరం చేస్తూ పోలీసుశాఖ ‘సీఎల్‌యాప్‌‘ పేరిట కొత్త మొబైల్‌ యాప్‌ను రూపొందించింది. ఈ కొత్త యాప్‌ను సచివాలయంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ శుక్రవారం ఉదయం ఆవిష్కరించారు. చెన్నై పోలీసు కమిషనరేట్‌ పరిధిలో 5800 మందికిపైగా కానిస్టేబుళ్లు పనిచేస్తున్నారు. వీరందరూ అత్యవసర పరిస్థితుల్లో సెలవు పెట్టడానికి సీఐ, ఎస్‌ఐల వద్దకు వెళ్ళి సెలవుచీటీ ఇవ్వాల్సి ఉంటుంది. సాయుధ, ప్రత్యేక దళంలో పనిచేసే పోలీసులు సెలవు వివరాలను తమ హాజరుపట్టిలో నమోదు చేసి మరీ వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ఇబ్బందులేవీ లేకుండా ఈ మొబైల్‌యా్‌పలో సెలవు తీసుకోవడానికి వీలుందని ముఖ్యమంత్రి స్టాలిన్‌ తెలిపారు. ఇకపై పోలీసులు ఈ కొత్త యాప్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుని తామున్న చోటు నుంచే సీఎల్‌, ఈఎల్‌, ఎంఎల్‌ ఆన్‌లైన్‌లో మంజూరు చేసుకోవడానికి వీలుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ఎస్కే ప్రభాకర్‌, డీజీపీ శైలేంద్రబాబు, గ్రేటర్‌ చెన్నై పోలీసు కమిషనర్‌ శంకర్‌జివాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-22T16:02:09+05:30 IST