నగరం.. త్రివర్ణ శోభితం

ABN , First Publish Date - 2022-08-14T06:49:21+05:30 IST

స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో శనివారం నగరంలో నిర్వహించిన ఫ్రీడం ర్యాలీ ఉత్సాహం గా సాగింది. 750 మీటర్ల త్రివర్ణపతాకాన్ని నగరంలోని నడి వీధుల గుండా ఊరేగించగా.. నగరం త్రివర్ణశోభితమైం ది. నగరంలోని నెహ్రూ పార్కు నుంచి మొదలుకొని గాంఽధీచౌక్‌, ఆర్‌పీ రోడ్‌, బస్టాండ్‌ మీదుగా కలెక్టరేట్‌ వరకు జా తీ య జెండాలతో ఫ్రీడం ర్యాలీ కొనసాగింది.

నగరం.. త్రివర్ణ శోభితం
నగరంలోని ప్రధాన వీధుల గుండా భారీ జెండాతో సాగుతున్న ర్యాలీ

నగరంలో ఉత్సాహంగా సాగిన ఫ్రీడం ర్యాలీ

750 మీటర్ల త్రివర్ణ పతాక ప్రదర్శన

పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు

నిజామాబాద్‌ అర్బన్‌, ఆగస్టు 13: స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో శనివారం నగరంలో నిర్వహించిన ఫ్రీడం ర్యాలీ ఉత్సాహం గా సాగింది. 750 మీటర్ల త్రివర్ణపతాకాన్ని నగరంలోని నడి వీధుల గుండా ఊరేగించగా.. నగరం త్రివర్ణశోభితమైం ది. నగరంలోని నెహ్రూ పార్కు నుంచి మొదలుకొని గాంఽధీచౌక్‌, ఆర్‌పీ రోడ్‌, బస్టాండ్‌ మీదుగా కలెక్టరేట్‌ వరకు జా తీ య జెండాలతో ఫ్రీడం ర్యాలీ కొనసాగింది. 75ఏళ్ల వేడుకల కు సంకేతంగా 750మీటర్ల పొడవైన జాతీయ జెండా ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పెద్దసంఖ్యలో విద్యార్థు లు, ఉద్యోగులు, అధికారులు, పోలీసులు, ఎన్‌సీసీ క్యాడె ట్స్‌, వైద్యులు, నర్సింగ్‌ విద్యార్థులు, న్యాయవాదులు, క్రీడా సం ఘాల ప్రతినిధులు, ఆర్మీ అధికారులు, వివిధ వర్గాల ప్రజ లు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌, కలెక్టర్‌ నారాయణరెడ్డి, సీపీ నాగరాజు, మేయర్‌ నీతుకిరణ్‌, అదనపు కలెక్టర్‌లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్‌, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు కలెక్టరేట్‌ మైదానంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ప్ర శాంత్‌రెడ్డి మాట్లాడుతూ బ్రిటీష్‌ వలస పాలకుల చేతిలో బంధీ అయిన భారతదేశానికి స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు క ల్పించేందుకు ఎంతోమంది ప్రాణత్యాగం చేశారని, వారందరికీ ప్రభుత్వం తరపున జిల్లా ప్రజల తరపున నివాళ్లు అర్పి స్తున్నామన్నారు. దీనిలో భాగంగానే ప్రభుత్వం వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోందన్నారు. ఈనెల 8నుంచి ప్రారంభమైన కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణంలో కొనసాగుతున్నాయన్నారు. జిల్లాకేంద్రంలో నిర్వహించిన వేడుకలు స్వాతంత్య్ర ఔన్నత్యాన్ని చాటాయని, విజయవంతం చేసిన జిల్లా యంత్రాంగం, పోలీసులు, అధి కారులకు అభినందనలు తెలిపారు. ఈనెల 22వరకు జరిగే వజ్రోత్సవ వేడుకలను అదే స్ఫూర్తితో జయప్రదం చేయాల ని, ప్రజాప్రతినిధులే కాకుండా అన్నివర్గాల వారు భాగస్వాములు కావాలన్నారు. ఆ తర్వాత కలెక్టర్‌ నారాయణరెడ్డి మాట్లాడుతూ ఈనెల 15న ప్రతీ ఇంటిపై త్రివర్ణపతాకం సగౌరవంగా ఎగురవేయాలని, 16న ఉదయం 11.30గంటల కు ఎక్కడివారక్కడ అన్ని కార్యాలయాలు, కూడళ్ల వద్ద సా మూహిక జాతీయ గీతాలాపన చేయాలన్నారు. జాతీయ గీతాలాపనతో ఫ్రీడం ర్యాలీ ముగించారు. నకార్యక్రమంలో అదనపు డీసీపీ అర్వింద్‌బాబు, నిజామాబాద్‌ ఆర్‌డీవో రవి, ఒలంపిక్‌ సంఘం అధ్యక్షుడు రాములు, టీఎన్‌జీవోస్‌ అధ్య క్షుడు కిషన్‌, ట్రస్మా అధ్యక్షుడు జయసింహగౌడ్‌, ఏసీపీ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-14T06:49:21+05:30 IST