8 విమానాల ద్వారా 1500 మంది భారత పౌరుల తరలింపునకు చర్యలు: పౌర విమానయాన శాఖ

ABN , First Publish Date - 2022-03-06T22:14:34+05:30 IST

ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్‌లో చిక్కకున్న భారతీయులను స్వదేశానికి తరలించడం కోసం భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగా’ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటి

8 విమానాల ద్వారా 1500 మంది భారత పౌరుల తరలింపునకు చర్యలు: పౌర విమానయాన శాఖ

ఎన్నారై డెస్క్: ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్‌లో చిక్కకున్న భారతీయులను స్వదేశానికి తరలించడం కోసం భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగా’ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటి వరకు ప్రభుత్వం ఎంత మంది భారత పౌరులను  ఇండియాకు తరలించిందనే విషయంపై పౌర విమానయాన మంత్రిత్వశాఖ కీలక ప్రకటన చేసింది. 11 విమానాల్లో సుమారు 2,135 మంది భారత పౌరులు ఈ రోజు (ఆదివారం) ఇండియాకు చేరుకున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దీంతో ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి చేరిన భారతీయుల సంఖ్య 15,900 దాటినట్లు పేర్కొంది. మార్చి 7న మరో ఎనిమిది విమానాల ద్వారా 1500 మంది భారతీయులను ఇండియాకు తరలించనున్నట్టు చెప్పింది. హంగేరీ రాజధాని బుడాపెస్ట్ నుంచి 5 విమానాలు, సూసెవా నుంచి రెండు, బుకారెస్ట్ ఒక విమానాన్ని నడపనున్నట్టు తెలిపింది. 




Updated Date - 2022-03-06T22:14:34+05:30 IST