పిల్లలమర్రి శివాలయాలను సందర్శించిన సివిల్‌ జడ్జి

Published: Mon, 15 Aug 2022 01:12:51 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పిల్లలమర్రి శివాలయాలను సందర్శించిన సివిల్‌ జడ్జి హుజూర్‌నగర్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి నర్సింహమూర్తిని సన్మానిస్తున్న ఆలయ కమిటీ సభ్యులు

సూర్యాపేటరూరల్‌, ఆగస్టు 14: సూర్యాపేట మునిసిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి దేవాలయాలను హుజూర్‌నగర్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి నర్సింమూర్తి కుటుంబ సమేతంగా ఆదివారం సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా శివాలయాల చరిత్రను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు జడ్జి నర్సింహమూర్తికి జ్ఞాపికను  అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో అర్చకులు మునగలేటి సంతోష్‌శర్మ, ఆలయ కమిటీ మాజీ చైర్మన్‌ రాపర్తి సైదులు, చెరుకుపల్లి శ్రీను పాల్గొన్నారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.