
శ్రీనగర్: ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శ్రీనగర్‌లోని అమీరా కాదల్ మార్కెట్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఆదివారం గ్రనేడ్ దాడి చేశారు. ఈ దాడిలో ఒక పౌరుడు మృతి చెందగా, ఒక జవాను సహా 21 మంది గాయపడ్డారు. రద్దీగా ఉండే మార్కెట్‌పై ఉగ్రవాదులు గ్రనేడ్ దాడి జరిపినట్టు పోలీసు ఉన్నతాధికారి ఒకరు ధ్రువీకరించారు. దాడిలో మృతి చెందిన పౌరుడి వివరాలు వెంటనే తెలియలేదు. ఘటన జరిగిన వెంటనే అదనపు బలగాలు అక్కడకు చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. దాడికి పాల్పడిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి