సివిల్ కోచింగ్ స్క్రీనింగ్ టెస్ట్: హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు

ABN , First Publish Date - 2021-12-08T21:41:45+05:30 IST

తెలంగాణ బిసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్స్ -2022 కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నవారు ఈనెల 11న జరిగే స్క్రీనింగ్ టెస్ట్ హాల్ టికెట్లను డౌన్ లోడ్ తీసుకోవాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ నామోజు బాలాచారి ఒక ప్రకటనలో వెల్లడించారు

సివిల్ కోచింగ్ స్క్రీనింగ్ టెస్ట్: హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు

హైదరాబాద్: తెలంగాణ బిసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్స్ -2022 కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నవారు ఈనెల 11న జరిగే స్క్రీనింగ్ టెస్ట్ హాల్ టికెట్లను డౌన్ లోడ్  తీసుకోవాలని  స్టడీ సర్కిల్ డైరెక్టర్ నామోజు బాలాచారి ఒక ప్రకటనలో వెల్లడించారు. బిసీ స్టడీ సర్కిల్  వెబ్ సైట్ http://tsbcstudycircle.cgg.gov.in లో  3064 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారందరీ హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయని ఆయన  తెలిపారు.బిసీ స్టడీ సర్కిల్ లోని జిల్లా కేంద్రాల్లో స్క్రీనింగ్ టెస్ట్ ఈ నెల 11 న రెండు విడతలుగా  ఉదయం 9 నుంచి 11 వరకు మొదటి షిఫ్ట్,  మధ్యాహ్నం12 నుంచి 2 వరకు రెండో షిఫ్ట్ పరీక్ష నిర్వహిస్తామన్నారు.  


రెండు గంటల పరీక్ష వ్యవధిలో మొత్తం వంద ప్రశ్నలకు సమాధానాలు రాయాలన్నారు. మొత్తం రెండు వందల మార్కుల పరీక్షలో ప్రశ్నాపత్రం ఇంగ్లీష్ లో ఉంటుందన్నారు. నెగటివ్ మార్క్ ఉందన్న విషయం అభ్యర్థులు గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, మాస్క్ లేనివారిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించమని ఆయన తెలిపారు. ఈ పరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ఉచితంగా సివిల్స్ కోచింగ్, మెటీరియల్ అందిస్తామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Updated Date - 2021-12-08T21:41:45+05:30 IST