
ఎడిసన్, న్యూజెర్సీ(జూన్ 24): అమెరికాలో ఆధ్యాత్మిక ప్రవాహాన్ని కొనసాగిస్తున్న న్యూజెర్సీ సాయిదత్త పీఠాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ సందర్శించారు. న్యూజెర్సీ ఎడిసన్‌లోని శ్రీ సాయి దత్త పీఠం శివ విష్ణు మందిరంలో వేద పండితులు ఎన్.వి.రమణకు వేద మంత్రోచ్ఛారణతో స్వాగతం పలికారు. దేవాలయంలో దేవతా మూర్తులను ఎన్.వి.రమణ దర్శించుకుని పూజలు చేశారు. వేద పండితుల ఆశీర్వాదం పొందారు. సాయి దత్త పీఠం ఆలయ చైర్మన్, ప్రధాన అర్చకులు రఘుశర్మ శంకరమంచి, న్యూజెర్సీ పబ్లిక్ యుటిలిటీస్ చైర్మన్ ఉపేంద్ర చివుకుల, ఆలయ బోర్డ్ డైరెక్టర్లు, స్టాఫ్, వాలంటీర్లు ఎన్.వి.రమణను కలిసి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.






ఇవి కూడా చదవండి