'వాలిమై'లో అజిత్ రోల్‌పై క్లారిటీ

Jun 13 2021 @ 13:25PM

కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ నటిస్తున్న సినిమా 'వాలిమై'. హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. బాలీవుడ్ మేకర్ బోనీ కపూర్‌ నిర్మిస్తున్నారు. అజిత్ - బోనీ కపూర్ - హెచ్‌.వినోద్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న రెండవ సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో తెలుగు యంగ్ హీరో కార్తికేయ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. దాదాపు టాకీ పార్ట్ పూర్తి  చేరుకున్న ఈ సినిమా, కొవిడ్‌ కారణంగా తాత్కాలికంగా ఆగింది. కాగా ప్రస్తుతం డబ్బింగ్‌ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో చిత్ర విశేషాలను వెల్లడించారు. 'ప్రస్తుతం విదేశాలలో చిత్రీకరించాల్సిన ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ మాత్రమే మిగిలి ఉంది. విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు తొలగించగానే చిత్రీకరణ ప్రారంభిస్తాం. ఈ సినిమాలో అజిత్‌ సీబీసీఐడి అధికారిగా కనిపిస్తారు'.. అని వినోద్‌ తెలిపారు. ఇంతకముందు ఇదే కాంబినేషన్‌లో బాలీవుడ్ హిట్ సినిమా పింక్ 'నేర్కొండ పార్వైగా రీమేక్ చేసి హిట్ అందుకున్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.