Delhi JNUలో మాంసాహారంపై విద్యార్థుల మధ్య రాజుకున్న ఘర్షణ...ఆరుగురికి గాయాలు

ABN , First Publish Date - 2022-04-11T13:54:20+05:30 IST

నాన్ వెజ్ ఫుడ్ విషయంలో జేఎన్‌యూ విద్యార్థి సంఘాల మధ్య జరిగిన ఘర్షణలో ఆరుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు....

Delhi JNUలో మాంసాహారంపై విద్యార్థుల మధ్య రాజుకున్న ఘర్షణ...ఆరుగురికి గాయాలు

న్యూఢిల్లీ:  నాన్ వెజ్ ఫుడ్ విషయంలో జేఎన్‌యూ విద్యార్థి సంఘాల మధ్య జరిగిన ఘర్షణలో ఆరుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలోని కావేరీ హాస్టల్‌లో ఆదివారం రామనవమి రోజున మెస్‌లో మాంసాహారం అందించినందుకు రెండు గ్రూపుల విద్యార్థులు ఘర్షణకు దిగారు. హింసలో ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.అయితే ఇరువర్గాలకు చెందిన 60 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారని రెండు వర్గాల విద్యార్థులు పేర్కొన్నారు. హింసకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి. అఖ్తరిస్తా అన్సారీ అనే విద్యార్థి తల నుంచి రక్తస్రావం అవుతున్నట్లు వీడియోలో కనిపించింది. 


అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సభ్యులు హాస్టల్ మెస్‌లో విద్యార్థులను మాంసాహారం తినకుండా అడ్డుకొని, హింసాత్మక వాతావరణాన్ని సృష్టించారని ఆరోపించారు.అయితే, ఏబీవీపీ ఆ అభియోగాన్ని ఖండించింది. రామ నవమి నాడు హాస్టల్‌లో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమాన్ని మరో వర్గం విద్యార్థులు అడ్డుకున్నారు.ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుని తమ సభ్యులను గాయపరిచారని ఆరోపించారు. మొత్తం ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయని, వారిని ఆసుపత్రికి తరలించామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్‌వెస్ట్) మనోజ్ తెలిపారు.

Updated Date - 2022-04-11T13:54:20+05:30 IST