అగ్రరాజ్యం అమెరికాలో పేలిన తూటా.. నల్లజాతి యువకుడు మృతి!

ABN , First Publish Date - 2021-04-12T17:08:01+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో పోలీసు తూటాకు మరో నల్లజాతీయుడు బలయ్యాడు. దీంతో నిరసనలు వెల్లవెత్తాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. స్నేహితురాలితో కారులో వెళ్తున్న 20ఏళ్ల డాంటే రైట్ అనే యువకుడిపై ఓ

అగ్రరాజ్యం అమెరికాలో పేలిన తూటా.. నల్లజాతి యువకుడు మృతి!

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో పోలీసు తూటాకు మరో నల్లజాతీయుడు బలయ్యాడు. దీంతో నిరసనలు వెల్లవెత్తాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. స్నేహితురాలితో కారులో వెళ్తున్న 20ఏళ్ల డాంటే రైట్ అనే యువకుడిపై ఓ పోలీసు అధికారి కాల్పులు జరిపాడు. దీంతో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ క్రమంలో వేలాది మంది నల్లజాతీయులు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించిన ఘటన మిన్నెపోలీస్ నగరంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు నియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. కాగా.. దీనిపై పోలీసులు స్పందించారు. డాంటే రైట్ ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించాడని.. దీంతో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించినట్టు చెప్పారు. అయితే డాంటే రైట్.. దానికి నిరాకరించడంతో ఓ పోలీసు అధికారి అతనిపై కాల్పులు జరిపినట్టు వివరించారు. ఈ క్రమంలో అతను ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు. అంతేకాకుండా ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్టు వెల్లడించారు. 


ఇదిలా ఉంటే.. గత ఏడాది జార్జి ఫ్లాయిడే అనే నల్లజాతి వ్యక్తిని ఓ పోలీసు అధికారి కాలితో తొక్కి క్రూరంగా చంపేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా నిరసనలను దారి తీసింది. ప్రస్తుతం ఈ ఘటనపై కోర్టులో విచారణ సాగుతుండగా.. పోలీసు అధికారి తూటాకు మరో నల్లజాతి యువకుడు ప్రాణాలు కోల్పడం కలకలం సృష్టిస్తోంది. 


Updated Date - 2021-04-12T17:08:01+05:30 IST