8వ తరగతి విద్యార్థిపై 10వ తరగతి విద్యార్థి లైంగిక వేధింపులు

ABN , First Publish Date - 2022-09-21T12:31:08+05:30 IST

వెంకటగిరి పట్టణంలోని క్రాస్‌ రోడ్డు సమీపంలో ఉన్న సాంఘిక సంక్షేమ బీసీ వసతి గృహంలో 8వ తరగతి విద్యార్థిపై 10వ తరగతి విద్యార్థి

8వ తరగతి విద్యార్థిపై 10వ తరగతి విద్యార్థి లైంగిక వేధింపులు

తిరుపతి: వెంకటగిరి పట్టణంలోని క్రాస్‌ రోడ్డు సమీపంలో ఉన్న సాంఘిక సంక్షేమ బీసీ వసతి గృహంలో 8వ తరగతి విద్యార్థిపై 10వ తరగతి విద్యార్థి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసుల కథనం మేరకు... కొంతకాలంగా 8వ తరగతి విద్యార్థిపై 10వ తరగతి విద్యార్థి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ విషయంపై వాచ్‌మెన్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో బాధిత విద్యార్థి వసతిగృహం నుంచి రెండురోజుల క్రితం పరారయ్యాడు.ఈ సమాచారం తెలుసుకున్న బాధిత విద్యార్థి తల్లిదండ్రులు తమ పిల్లాడిని వెతికి పట్టుకుని విషయం తెలుసుకున్నారు.ఈ విషయంపై  వార్డెన్‌ను ప్రశ్నించినా స్పందించకపోవడంతో మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2022-09-21T12:31:08+05:30 IST