పాల సంఘం ఎన్నికల్లో బయటపడ్డ వర్గ విభేదాలు

ABN , First Publish Date - 2022-06-28T06:55:31+05:30 IST

పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఎన్నికల సందర్భంగా చిట్యాల మండలం వెలిమినేడులో సోమవారం అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి.

పాల సంఘం ఎన్నికల్లో బయటపడ్డ వర్గ విభేదాలు
వెలిమినేడు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం

 ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అనుచరుల పోటాపోటీ  

ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు

చిట్యాలరూరల్‌, జూన 27: పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఎన్నికల సందర్భంగా చిట్యాల మండలం వెలిమినేడులో సోమవారం అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. డైరెక్టర్ల ఎన్నిక, చైర్మన ఎన్నిక హైడ్రామాను తలపించింది. గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇద్దరు పాల సం ఘం డైరెక్టర్ల ఎన్నిక నిర్వహించారు. రెండు డైరెక్టర్లలో ఒకరు ఎమ్మె ల్యే చిరుమర్తి లింగయ్యవర్గానికి చెందిన మేడబోయిన అంజయ్య గె లుపొందారు. మరొకరు మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వర్గానికి చెందిన అభ్యర్థి మద్దెపురం లింగస్వామి విజయం సాధించారు. సం ఘంలో 10మంది డైరెక్టర్లు ఉండగా డైరెక్టర్ల ఎన్నికలతో పాటు చైర్మన ఎన్నిక కూడా ఉంది. దీంతో ఎమ్మెల్యే వర్గానికి చెందిన ఆరుగురు డైరెక్టర్లలో ఐదుగురు హాజరుకాగా ఒక డైరెక్టర్‌ మారగోని యాద య్య గైర్హాజరైనారు. మరోవర్గానికి చెందిన నలుగురు డైరెక్టర్లు హాజరవడంతో మొత్తం 9మంది పాల్గొన్నారు. ఎమ్మెల్యే వర్గానికి చెందిన గడ్డం సూర్యప్రకా్‌షరెడ్డి సంఘం చైర్మనగా బరిలో ఉండగా మిగతా నలుగురు సభ్యులు మద్దతును తెలిపారు. దీంతో ఎన్నికల అధికారి ప్రభాకరశర్మ చైర్మనగా సూర్యప్రకా్‌షరెడ్డిని ప్రకటించారు. ఎన్నిక జ రుగుతుండగానే కోరం లేదని మాజీ ఎమ్మెల్యే వర్గం డైరెక్టర్లు బైలా ప్రకారం ఎన్నిక నిర్వహించాలని బయటకు వెళ్లిపోయారు.

 ఇరువర్గాల పోటీపోటీ నినాదాలు

పాల సంఘం ఎన్నికలో చైర్మన ఎన్నికు ఏకపక్షంగా నిర్వహించారని మాజీ ఎమ్మెల్యే వర్గం డైరెక్టర్లు గ్రామపంచాయతీ ఎదుట తమ అనుచరులతో నినాదాలు చేశారు. ఎమ్మెల్యే వర్గానికి చెందిన వారు కూడా నినాదాలు చేయడంతో ఇరువర్గాలు పోటాపోటీగా నినాదా లు చేస్తుండటంతో వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. చిట్యాల ఎస్‌ఐ సైదాబాబు, ఎస్‌ఐ-2 నవీనకుమార్‌ ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. 



Updated Date - 2022-06-28T06:55:31+05:30 IST