Chennai : పదోతరగతి విద్యార్థికి కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2021-09-07T16:58:08+05:30 IST

పాఠశాలలు పునర్ ప్రారంభం అనంతరం పదోతరగతి చదువుతున్న ఓ విద్యార్థికి కరోనా పాజిటివ్ అని తేలిన ఘటన...

Chennai : పదోతరగతి విద్యార్థికి కరోనా పాజిటివ్

చెన్నై (తమిళనాడు): పాఠశాలలు పునర్ ప్రారంభం అనంతరం పదోతరగతి చదువుతున్న ఓ విద్యార్థికి కరోనా పాజిటివ్ అని తేలిన ఘటన తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరంలో వెలుగుచూసింది.చెన్నైలోని ఓ పాఠశాలలో 120 మంది విద్యార్థులకు కరోనా ఆర్టీ పీసీఆర్ పరీక్షలు చేయగా, అందులో ఓ విద్యార్థికి కరోనా పాజిటివ్ అని వెల్లడైంది. తమిళనాడు రాష్ట్రంలో ఈ నెల 1వతేదీ నుంచి పాఠశాలలు పునర్ ప్రారంభమయ్యాయి. కరోనా పాజిటివ్ అని వచ్చిన విద్యార్థి తల్లిదండ్రులకు కూడా కొవిడ్ సోకిందని తేలింది. కరోనా సోకిన పదోతరగతి విద్యార్థి కుటుంబం ఇటీవల బెంగళూరు నగరంలో పర్యటించి వచ్చిందని వైద్యాధికారులు చెప్పారు. ఓ విద్యార్థికి కరోనా పాజిటివ్ అని తేలడంతో తమిళనాడు వైద్యశాఖ అప్రమత్తమైంది.


దేశంలో గత 24 గంటల్లో 31,222 కరోనా కేసులు నమోదు కాగా, 290 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది. కేరళలో 19,688 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య పెరిగింది. మహారాష్ట్రలో 3,626 తమిళనాడులో 1556 కేసులు, మిజోరంలో 1468, కర్ణాటకలో 973 కరోనా కేసులు వెలుగుచూశాయి.


Updated Date - 2021-09-07T16:58:08+05:30 IST