నిబంధనలు ‘మట్టి’ కరుస్తున్నాయి

ABN , First Publish Date - 2021-03-01T04:52:29+05:30 IST

మండలంలోని సింగసముద్రం నుంచి జోరుగా మట్టి తోలకాలు సాగుతున్నాయి. ఓ రహదారి నిర్మాణం కోసం టిప్పర్లు ఏర్పాటు చేసి ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్నారు.

నిబంధనలు ‘మట్టి’ కరుస్తున్నాయి
ఎక్స్‌కవేటర్‌తో లారీలోకి మట్టిని పోస్తున్న దృశ్యం

సింగసముద్రంలో జోరుగా మట్టి రవాణా

రెవెన్యూ అధికారులు అడ్డుకున్నా ఆగని అక్రమార్కులు

చర్ల, ఫిబ్రవరి 26: మండలంలోని సింగసముద్రం నుంచి జోరుగా మట్టి తోలకాలు సాగుతున్నాయి. ఓ రహదారి నిర్మాణం కోసం టిప్పర్లు ఏర్పాటు చేసి ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్నారు. అడిగే వారు లేక పోవడంలో ప్రభుత్వా ఆదాయానికి గండి కొడుతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెడతామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. గతంలోనూ ఇదే రీతిలో వందల సంఖ్యల లారీల మట్టి తరలించుకు పోయారు. ప్రస్తుతం మళ్లీ అదే రీతిలో రహదారి నిర్మాణ పనుల కోసం మట్టిని తరలిస్తున్నారు. శని, ఆదివారం జోరుగా లారీలు పెట్టి మట్టిని తరలించారు. స్థానికులు ఫిర్యా దు చేయడంలో ఆదివారం ఉదయం చర్ల రెవెన్యూ సిబ్బంది మట్టి తరలిస్తున్న టిప్పర్లను పట్టుకున్నారు. కాగా మళ్లీ గంటలోనే టిప్పర్లు పెట్టి మట్టిని తరలించారు. కాగా గత నెలలో ఇదే రీతిలో భారీగా మట్టిని తరలించారు. ఇలా మ ట్టి అవసరం ఏర్పడినప్పుడల్లా యథేచ్ఛగా తీసుకెళ్తున్నారు.

సింగసముద్రం నుంచి తోలకాలు

చర్ల మండలం కొత్తపల్లి నుంచి కత్తిగూడెం వరకు నూ తన రహదారి నిర్మాణానికి ప్రభుత్వం సుమారు 7.5 కోట్లు మంజూరు చేసింది. పనులు దిక్కంచుకున్న సదరు నిర్వాహకులు నిర్మాణ పనులు చేపట్టారు. పనుల కోసం భారీగా మట్టి అవసరం ఏర్పడింది. దీంతో ప్రభుత్వానికి చలానాలు కట్టకుండా, చర్ల మండలం సింగసముద్రంలోని ఓ వ్యక్తి భూమి నుంచి టిప్పర్లతో మట్టిని తరలిస్తున్నారు.

ప్రభుత్వ ఆదాయనికి గండి

రహదారి నిర్మాణం కోసం ఎంత మట్టి అవసరం పడుతుందో టెండర్లలోనే ప్రభుత్వం నగదు కేటాయిస్తుంది. ప్రభుత్వానికి నగదు చెల్లించి అధికారులు చూపించిన క్వారీ నుం చి తెచ్చు కోవాలని సూచిస్తుంది. కాగా సంబందిత నిర్వాహకులు ఆ నగదును కొత్తగూ డెం మైనింగ్‌ అధికారుల నుంచి అనుమతి (ప్రభుత్వానికి నగదు చెల్లించి) తీసుకోని, వా రు చూపించిన ప్రభుత్వ క్వారీ నుంచి మట్టి తరలించాల్సి ఉంది. కాగా అవేమీ లేకుండా సింగసమ్రుదంలోని ఓ వ్యక్తి భూమి నుంచి నుంచి మట్టి తరలిస్తున్నారు. గత నెల్లో కూ డా ఇదే రీతిలో మట్టిని కొల్లగొట్టారు. తాజాగా శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు, ఆదివారం ఉదయం నుంచి మళ్లీ తోలకాలు ప్రారంభించారు. కాగా కొంత మంది స్థానికులు ఫిర్యాదు చేయడంలో రెవెన్యూ సిబ్బంది లారీలను నిలిపివేశారు. ఇది జరిగిన గంటలోనే తోలకాలు ప్రారంభమయ్యాయి. 

జరిమానా విధించాలి

నిబందనల ప్రకారం ప్రభుత్వానికి నగదు చెల్లించి మట్టిని తరలించాలి, అలా కాకుం డా ఇప్పటి వరకు వందల సంఖ్యల లారీల మట్టిని తరలించారు. జిల్లా కలెక్టర్‌ దృష్టి సారించి ఇప్పటి వరకు తరలించిన మట్టికి జరిమానా వేసి ఆ నగదును ప్రభుత్వానికి అందెలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కాగా ఇదే విష యమై చర్ల తహసీల్దార్‌ను డీవీబీ ప్రసాద్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా ‘మట్టి తరలింపు కోసం ఎన్‌వోసీ పంపించాం. నేడో, రేపో అనుమతులు వస్తాయి. అభివృద్ధి పనుల కోసమని చెబితే కొంత మినహాయింపు ఇచ్చామని’ తెలిపారు.

Updated Date - 2021-03-01T04:52:29+05:30 IST