క్లీన్‌ కిచెన్‌

ABN , First Publish Date - 2020-04-22T05:37:09+05:30 IST

కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు చేతులు శుభ్రం చేసుకుంటున్నాం. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మరి వంట గది సంగతి ఏంటి? కిచెన్‌ను ఎలా శుభ్రం చేస్తున్నారు?...

క్లీన్‌ కిచెన్‌

కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు చేతులు శుభ్రం చేసుకుంటున్నాం. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మరి వంట గది సంగతి ఏంటి? కిచెన్‌ను ఎలా శుభ్రం చేస్తున్నారు? ఇదిగో నిపుణులు చెబుతున్న మాట. 


కూరగాయలు కోసే ముందు తప్పనిసరిగా నీటితో శుభ్రం చేయాలి. కాసేపు ఉప్పు నీళ్లలో వేసి, ఆ తరువాత శుభ్రం చేసుకుని వాడితే మరీ మంచిది.


ఆకుకూరలను రెండు, మూడు సార్లు నీటితో కడగాలి.


కూరగాయలు తరిగే కత్తి, పొట్టు తీసే కట్టర్‌ను సబ్బుతో శుభ్రం చేయాలి. స్టవ్‌ను రోజూ శుభ్రం చేసుకోవాలి.


కిచెన్‌ క్యాబినెట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. 


ఎక్కువ కాలం ఫ్రిజ్‌లో నిలువ ఉంచిన పదార్థాలను తినకుండా ఉండడమే ఉత్తమం.


వేడి వేడిగా ఆహారం వండుకుని, తినాలి. 


పాత్రలు శుభ్రం చేశాక వేడినీళ్లలో వేసి తీయాలి. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా, వైరస్‌ తొలగిపోతాయి.


ఆహారం వండే ముందు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవడం మరువద్దు. 


పండ్లను బాగా శుభ్రం చేసిన తరువాతే తినాలి.

Updated Date - 2020-04-22T05:37:09+05:30 IST