మీరే నా పసిప్రాణాన్ని కాపాడాలి...

ABN , First Publish Date - 2022-07-02T22:45:29+05:30 IST

డాక్టర్స్ మా దగ్గరికి వచ్చినప్పుడు మేం ఆస్పత్రిలో నా కొడుకు ఉన్న బెడ్ పక్కనే ఉన్నాం. నా కొడుక్కి చెయ్యాల్సిన అవయవ మార్పిడికి దాతగా...

మీరే నా పసిప్రాణాన్ని కాపాడాలి...

డాక్టర్స్ మా దగ్గరికి వచ్చినప్పుడు మేం ఆస్పత్రిలో నా కొడుకు  ఉన్న బెడ్ పక్కనే ఉన్నాం. నా కొడుక్కి చెయ్యాల్సిన అవయవ మార్పిడికి దాతగా నేను సరిగ్గా సరిపోతానని వాళ్లు చెప్పినప్పుడు మేము తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాం. ఎట్టకేలకి నా కొడుక్కి ఉన్న సమస్య నయమవుతుందని మనసు తేలికపడింది కానీ, అంతలోనే... ఈ వైద్యానికయ్యే ఖర్చు ఎలా భరించాలో తెలియక గుండె బరువెక్కిందని సంగీత ఆవేదనతో చెప్పింది. సంగీత కొడుకు రిహాన్ పుట్టినప్పటి నుంచే ఎన్నో సమస్యల్ని ఎదుర్కుంటున్నాడు. పుట్టుకతోనే గ్రహణం మొర్రి (Cleft Lip) ఉండటంతో చనుబాలు పట్టడం చాలా కష్టంగా మారింది.


కానీ, సమస్య అక్కడితో ఆగిపోలేదు. గత కొద్ది నెలలుగా రిహాన్ కడుపు అనూహ్యంగా వాచిపోవడం, కళ్లు పచ్చబారడం వల్ల ఆ పిల్లవాడిని ఆస్పత్రుల చుట్టూ తిప్పుతూనే ఉన్నారు. ఆ పసివాడిని ఆస్పత్రికి తీసుకెళ్లినప్పుు డాక్టర్లు కొన్ని పరీక్షలు చేసి, బాబుకి  Progressive Familial Intrahepatic Cholestasis అనే సమస్య ఏర్పడిందని చెప్పారు. వారు చెప్పిన ప్రకారం.... రిహాన్ కాలేయం బాగా పాడైంది. ప్రస్తుతం ఆ పసివాడి పరిస్థితి చాలా కష్టంగా మారడంతో వెంటనే అవయవమార్పిడి జరగాలని చెప్పారు. ఆవయవమార్పిడికి దాతలుగా రిహాన్ తల్లిదండ్రుల అవయవాలు సరిగ్గా సరిపోతాయని కూడా డాక్టర్లు చెప్పారు. అయితే ఇందుకు సుమారుగా రూ.20 లక్షలు ($ 25620.98) ఖర్చవుతుందని తెలిపారు. కానీ, ఆ కుటుంబం ఇప్పటికే కొన్నేళ్ళుగా ఆర్ధిక ఇబ్బందులతో పాటు మరెన్నో కష్టాల్ని అనుభవించింది.


రిహాన్ అమ్మనాన్నలైన సంగీత, ఆమె భర్త సుబ్రదిప్ ఇద్దరూ పాక్షిక దివ్యాంగులు. సంగీతకు ఒక కాలు మరో కాలికంటే చిన్నది. నడవటానికి ఎంతో ఇబ్బంది పడుతుంటుంది. మరోవైపు ఆమె భర్తకు వినికిడి సమస్య ఉంది. ఎన్నో ఏళ్ళ నిరీక్షణ తర్వాత సంగీతకు రిహాన్ పుట్టాడు. కానీ, ఆ పసివాడు ఇప్పుడు జీవన్మరణ సమస్యతో పోరాడుతున్నాడు. తమ సంతానం కోసం సర్వస్వాన్నీ ధారపోసేందుకు తల్లిదండ్రులు ఎప్పుడూ ముందుంటారు. అలాగే రిహాన్ కోసం సంగీత, ఆమె భర్త తమకున్నదంతా త్యాగం చేశారు. వారి దగ్గర ఇప్పుడేమీ మిగల్లేదు. అయితే, వీలైనంత త్వరగా ఆవయవ మార్పిడి జరగకపోతే రిహాన్ పరిస్థితి మరింత కష్టంగా మారుతుందని, చెప్పాలంటే... కొన్ని వారాల సమయం మాత్రమే ఉందని హెచ్చరించారు.


రిహాన్‌కి కొత్త జీవితాన్ని అందించేందుకు సంగీత కుటుంబం చేస్తున్న ప్రయత్నాలని వృథా కానివ్వద్దు. ఈ పోరాటంలో రిహాన్‌కి చేయూతనివ్వండి. ఈ కష్టం నుంచి గట్టెక్కేందుకు ఆ కుటుంబానికి సాయపడండి. ఆర్ధిక సహకారం అందించండి.

Updated Date - 2022-07-02T22:45:29+05:30 IST