పోలీసు జీపు ఎక్కి మహిళ నిరసన

ABN , First Publish Date - 2021-12-08T05:52:11+05:30 IST

అత్తామా మలతో ఉన్న వివాదంలో తనకు న్యాయం చేయాలని ఓ మహిళ పోలీ సు జీపు ఎక్కి మంగళవారం నిరసన తెలిపింది.

పోలీసు జీపు ఎక్కి  మహిళ నిరసన
పోలీస్‌ జీపు ఎక్కి నిరసన తెలుపుతున్న మహిళ

రుద్రంగి డిసెంబర్‌ 7: అత్తామా మలతో ఉన్న వివాదంలో తనకు న్యాయం చేయాలని ఓ మహిళ పోలీ సు జీపు ఎక్కి మంగళవారం నిరసన తెలిపింది. రుద్రంగి మండలంలోని గైదిగుట్ట తండాకు చెందిన మౌనిక అదే గ్రామానికి చెందిన గుగులోత్‌ మనోజ్‌తో ఐదు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. పైళ్లైన సంవత్స రానికి వేధింపులు మొదలుకావడంతో 2019లో అత్త, మామ, భర్తపై మౌని క కేసు పెట్టింది. ప్రస్తుతం మౌనిక తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది. ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మౌనిక పుట్టింటి వారు తమను కొడుతు న్నారని ఆమె అత్తమామలు పోలీసులను ఆశ్రయించారు. దీనితో విచారణకు మౌనిక మేనమామను తీసుకెళ్లడానికి పోలీసులు వచ్చారు. జీపులో అతన్ని తీసుకెళ్తుండగా మౌనిక అడ్డుకుని, తన ఇద్దరు పిల్లలతో పోలీసు జీపుపైకి ఎక్కి నిరసన తెలిపింది. ఎస్‌ఐ రాజు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో జీపు దిగింది.  

Updated Date - 2021-12-08T05:52:11+05:30 IST