జీపీఎఫ్‌ ఖాతాల్లో యథావిధిగా క్లోజింగ్‌ బ్యాలెన్స్‌

ABN , First Publish Date - 2022-07-01T09:03:43+05:30 IST

జీపీఎఫ్‌ ఖాతాల్లో యథావిధిగా క్లోజింగ్‌ బ్యాలెన్స్‌

జీపీఎఫ్‌ ఖాతాల్లో యథావిధిగా క్లోజింగ్‌ బ్యాలెన్స్‌

ఏ ఉద్యోగికీ నష్టం జరగలేదు

బొప్పరాజు, వైవీ రావు వెల్లడి

విజయవాడ(వన్‌టౌన్‌ ), జూన్‌ 30: ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాలలో క్లోజింగ్‌ బ్యాలెన్స్‌లు యథాతథంగా ఉన్నాయని ఉద్యోగుల సంఘ జేఏసీ నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, వైవీ రావు గురువారం ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ విషయంలో ఉద్యోగులెవరూ ఆందోళన చెందనవసరం లేదన్నారు. ‘మేం ఏజీ కార్యాలయంలో ఉన్న ముఖ్యమైన ఉన్నతాధికారులతో మాట్లాడాం. ఉద్యోగులకు వచ్చిన సందేశాలు కేవలం ఈ ఏడాది మార్చి నెలకు సంబంధించిన నెలవారీ సబ్‌ స్ర్కిప్షన్‌కు సంబంధించిన పోస్టింగ్‌ అని తెలిపారు. మార్చి 31వ తేదీ నాటికి ఉద్యోగి చెల్లించిన బ్యాలెన్స్‌ మొత్తాన్ని ఉద్యోగులకు పంపించిన సందేశంలో తెలియచేశామని, అది క్లోజింగ్‌ బ్యాలెన్స్‌ ఏ మాత్రం కాదని స్పష్టం చేశారు. 2021-2022 సంవత్సరానికి సంబంధించి జీపీఎఫ్‌ అకౌంట్‌ స్లిప్‌లలో 2022 ఏప్రిల్‌ ఒకటో తేదీ నాటికి చెల్లించిన మొత్తంను వడ్డీతో సహా కలిపి క్లోజింగ్‌ బ్యాలెన్స్‌ చూపించినట్లు తెలిపారు’ అని పేర్కొన్నారు. ఏ ఉద్యోగికీ ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టం చేశారు. 

Updated Date - 2022-07-01T09:03:43+05:30 IST