Closing Bell : జోష్‌లో ముగిసిన మార్కెట్లు.. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు ఎంత లాభపడ్డాయంటే..

ABN , First Publish Date - 2022-07-28T21:57:03+05:30 IST

వరుసగా రెండవ రోజు గురువారం సెషన్‌‌లో దేశీయ ఈక్విటీ మార్కెట్లు(Equity Markets) భారీ లాభాల్లో(Profits) ముగిశాయి. యూఎస్ ఫెడ్(US Fed) వడ్డీ రేట్లు పెంపు, రూపాయి బలపడడం ఇన్వెస్టర్లలో జోష్ నింపింది. ఫై

Closing Bell : జోష్‌లో ముగిసిన మార్కెట్లు.. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు ఎంత లాభపడ్డాయంటే..

ముంబై : వరుసగా రెండవ రోజు గురువారం సెషన్‌‌లో దేశీయ ఈక్విటీ మార్కెట్లు(Equity Markets) భారీ లాభాల్లో(Profits) ముగిశాయి. యూఎస్ ఫెడ్(US Fed) వడ్డీ రేటు పెంపు, రూపాయి బలపడడం ఇన్వెస్టర్లలో జోష్ నింపాయి. ఫైనాన్షియల్, టెక్ స్టాకులపై కొనుగోలు ఆసక్తి చూపడంతో బీఎస్ఈ సెన్సెక్స్(Sensex) 1041 పాయింట్లు లేదా 1.87 శాతం మేర వృద్ధి చెంది 56,858 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదే బాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ(Nifty50) సూచీ 288 పాయింట్లు లేదా 1.73 శాతం బలపడి 16,930 పాయింట్ల వద్ద స్థిరపడింది. మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు కూడా దృఢంగా రాణించాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 0.84 శాతం, స్మాల్ క్యాప్ సూచీ 0.85 శాతం మేర ఎగబాకాయి. బీఎస్ఈపై 1865 షేర్లు లాభపడగా.. 1389 షేర్లు నష్టల్లో ముగిశాయి. 141 షేర్లలో హెచ్చుతగ్గులు లేవు. బీఎస్ఈ మిడ్‌క్యాప్ సూచీ 1 శాతానికి దగ్గరగా, స్మాల్‌క్యాప్ 0.6 శాతం బలపడ్డాయి. నిఫ్టీపై గరిష్ఠంగా లాభపడిన స్టాకుల్లో బజాజ్ ఫైనాన్స్, బజాన్ ఫిన్‌సర్వ్, కోటక్ మహింద్రా బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్నాయి. ఇక నష్టపోయిన స్టాకుల జాబితాలో శ్రీసిమెంట్స్, భారతీ ఎయిర్‌టెల్, అల్ట్రాటెక్ సిమెంట్, సిప్లా, బజాజ్ ఆటో ఉన్నాయి. రంగాలవారీగా పరిశీలిస్తే.. బ్యాంక్, ఐటీ, పవర్, రియల్టీ రంగాల సూచీలు 1- 2 శాతం మధ్య లాభపడ్డాయి.   


జోష్‌కు కారణాలివే..

ఫెడ్ వడ్డీ రేటు పెంపు : యూఎస్ ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేటును 75 బేసిస్ పాయింట్ల మేర పెంచుతున్నట్టు చైర్‌పర్సన్ జెరోమ్ పావెల్ బుధవారం ప్రకటించారు. వడ్డీ రేటు పెంపు మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే ఉండడంతో సానుకూలమైంది. రేటు పెంపు ఎక్కువే అయినప్పటికీ ఇక ముందు ఈ స్థాయి పెంపు ఉండకపోవచ్చుననే విశ్లేషణలతో డాలర్ కాస్తంత బలహీనపడింది. మార్కెట్లలోనూ పెట్టుబడులకు ఇన్వెస్టర్లు మొగ్గుచూపారు.


గ్లోబల్ మార్కెట్ల సంకేతాలు: గురువారం గ్లోబల్ మార్కెట్లు సానుకూలంగా ఆరంభమయ్యాయి. ఆ సంకేతాలు ఇండియన్ ఇన్వెస్టర్లలో సెంటిమెంట్‌ను సానుకూలంగా మార్చాయి.  కాగా యూఎస్ మార్కెట్లతోపాటు ఆసియా ఈక్విటీలు కూడా గణనీయమైన లాభాల్లో ముగిశాయి. నిక్కీ, కోప్సీ, షాంఘై సూచీలు లాభాల్లో ముగిశాయి. 


తిరిగొచ్చిన ఎఫ్ఐఐలు : ఈ ఏడాది ఇప్పటివరకు 28.70 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విదేశీ ఇన్వెస్టర్లు విక్రయించారనే అంచాలున్నాయి. కాగా మార్కెట్లలో దిద్దుబాటు(కరెక్షన్) ముగిసిందనే విశ్లేషణలతో ప్రస్తుతం విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారు. ఇందుకు అనుగుణంగానే ఇండియన్ మార్కెట్లలో ఎఫ్ఐఐ(ఫారెన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్) ఇండియన్ మార్కెట్లలోకి తిరిగొచ్చారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.


బలపడ్డ రూపాయి : గురువారం ట్రేడింగ్‌లో దేశీయ కరెన్సీ రూపాయి బలపడింది. డాలర్ మారకంలో 14 పైసలు మెరుగుపడి 79.77 వద్ద ముగిసింది. అమెరికన్ డాలర్ బలహీనత ఇందుకు దోహదపడింది. మరోవైపు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును 75 బేసిస్ పాయింట్లు పెంచడం డాలర్ విలువ క్షీణతకు కారణమైంది. మార్కెట్లలోనూ పెట్టుబడులకు ఇన్వెస్టర్లు మొగ్గుచూపారు. వాస్తవానికి క్రూడ్ ఆయిల్ ధరలు, నెలాఖరు కావడంతో దిగుమతుల డిమాండ్ ఎక్కువగానే ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-28T21:57:03+05:30 IST