వన దేవతల గద్దెలు మూసివేత

ABN , First Publish Date - 2021-03-01T10:02:30+05:30 IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క-సారలమ్మల దర్శనాలను సోమవారం నుంచి నిలిపివేస్తున్నట్టు దేవాదాయ శాఖ ఈవో రాజేంద్ర తెలిపారు.

వన దేవతల గద్దెలు మూసివేత

  • కరోనా విజృంభించకుండా నిర్ణయం 
  • దేవాదాయ శాఖ ఈవో రాజేంద్ర

మేడారం, ఫిబ్రవరి 28 : కరోనా వ్యాప్తి నేపథ్యంలో ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క-సారలమ్మల దర్శనాలను సోమవారం నుంచి నిలిపివేస్తున్నట్టు దేవాదాయ శాఖ ఈవో రాజేంద్ర తెలిపారు. ఆదివారం ఆయన గద్దెల పరిసరాల్లో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు జరిగిన మినీ జాతరలో ప్రత్యేక బాధ్యతలు నిర్వర్వర్తించిన ఇద్దరు సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లకు కరోనా నిర్ధారణ కావడంతో పూజారుల సంఘం వినతి మేరకు 21 రోజులపాటు వనదేవతల గద్దెల దర్శనాలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. సోమవారం నుంచి భక్తులు మేడారం రావొద్దని అన్నారు.  

Updated Date - 2021-03-01T10:02:30+05:30 IST