చేర్యాలలో దుకాణాల బంద్‌

ABN , First Publish Date - 2021-04-24T05:20:02+05:30 IST

చేర్యాల పట్టణంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండడతో మునిసిపల్‌ పాలకవర్గ తీర్మానం మేరకు శుక్రవారం మధ్యాహ్నం రెండుగంటలకే అన్ని దుకాణాలను మూసి వేశారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.

చేర్యాలలో దుకాణాల బంద్‌

చేర్యాల, ఏప్రిల్‌ 23: చేర్యాల పట్టణంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండడతో మునిసిపల్‌ పాలకవర్గ తీర్మానం మేరకు శుక్రవారం మధ్యాహ్నం రెండుగంటలకే అన్ని దుకాణాలను మూసి వేశారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. అలాగే కరోనా నివారణ చర్యల్లో భాగంగా కడవేరుగు గ్రామంలోని బెల్టుషాపులు, కిరాణాదుకాణాదారులకు గ్రామపంచాయతీ సిబ్బంది శుక్రవారం నోటీసులు జారీచేశారు. 


మల్లన్న ఆలయ ఆవరణలో పారిశుధ్య చర్యలు


కొమురవెల్లి ఆలయ ఆవరణలో శుక్రవారం ఆలయాధికారులు పారిశుధ్య చర్యలు చేపాట్టారు. ఆలయ భవనంతో పాటు పరిసరాలు, బుకింగ్‌ కార్యాలయం, ప్రసాద తయారీశాల, పోలీస్‌ ఔట్‌పోస్ట్‌, రాజగోపురం, గంగిరేగుచెట్టు ప్రాంగణాల ఆవరణలో సోడియం హైపోక్లోరైడ్‌తో శానిటేషన్‌ చేశారు.  


 



Updated Date - 2021-04-24T05:20:02+05:30 IST