Cloudburst : జమ్మూకశ్మీర్‌లో నలుగురి మృతి, 40 మంది గల్లంతు

ABN , First Publish Date - 2021-07-28T15:07:12+05:30 IST

జమ్మూకశ్మీరులోని కిష్టవర్ ప్రాంతంలో బుధవారం ఉదయం మెరుపు వరదలు వెల్లువెత్తడంతో నలుగురు దుర్మరణం చెందగా...

Cloudburst : జమ్మూకశ్మీర్‌లో నలుగురి మృతి, 40 మంది గల్లంతు

శ్రీనగర్ (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీరులోని కిష్టవర్ ప్రాంతంలో బుధవారం ఉదయం మెరుపు వరదలు వెల్లువెత్తడంతో నలుగురు దుర్మరణం చెందగా, మరో 40 మంది గల్లంతు అయ్యారు. జమ్మూ రీజియన్‌లోని  కిష్టవర్ జిల్లా హోంజార్ గ్రామంలో మెరుపు వరదలు సంభవించడంతో 40 మంది గల్లంతు కాగా, నలుగురి మృతదేహాలను కనుగొన్నారు. బుధవారం 4.50 గంటలకు హోంజార్ గ్రామంలో వరదలకు 28 మంది కొట్టుకుపోయారు. మారుమూల గ్రామానికి ఫోన్ కనెక్టివిటీ లేకపోవడంతో తాజా సమాచారం అందలేదు. జమ్మూ నగరానికి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిష్టవర్ పట్టణం ఉంది. కిష్టవర్ జిల్లా కలెక్టరు అశోక్ కుమార్ శర్మ పోలీసు, ఆర్మీ బృందాలను సంఘటన స్థలానికి పంపించారు. వరదల్లో గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. 


Updated Date - 2021-07-28T15:07:12+05:30 IST