నేడు నల్లబెల్లికి సీఎం రాక

ABN , First Publish Date - 2021-07-24T05:55:31+05:30 IST

నేడు నల్లబెల్లికి సీఎం రాక

నేడు నల్లబెల్లికి సీఎం రాక

ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డిని పరామర్శించనున్న కేసీఆర్‌

నల్లబెల్లి, జూలై 23: ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం నల్లబెల్లి మండల కేంద్రానికి రానున్నారు. పితృవియో గం పొందిన నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని ఆయన పరామర్శిస్తారు. ఈ మేరకు అధికారులు పక డ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం హైదరాబాద్‌ నుం చి హెలీకాప్టర్‌లో నేరుగా నల్లబెల్లికి వస్తారు. ఇందుకో సం హెలీప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్ల లో భాగంగా శుక్రవారం పోలీసు అధికారులు, డాగ్‌ స్క్వాడ్‌ ఎమ్మెల్యే పెద్ది నివాస ప్రాంత పరిసరాలను పరిశీలించారు.  మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఏర్పా ట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కాగా, కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమ సమయంలో ఒకసారి నల్లబెల్లికి వ చ్చారు. సీఎం అయిన తర్వాత మేడపల్లిలో గ్రామజ్యోతి పథకం ప్రారంభానికి వచ్చారు. ఇప్పుడు మూడోసారి వస్తున్నారు.   ఇదిలావుండగా, రాష్ట్రంలో ఏకధాటి వర్షా లు కురుస్తుండటంతో సీఎం కేసీఆర్‌ నల్లబెల్లి పర్యటన పై అనిశ్చితి నెలకొంది. వాతావరణం అనుకూలిస్తేనే సీ ఎం నల్లబెల్లికి వస్తారని అధికారులు చెబుతున్నారు. మరోవైపు మూడు రోజులుగా నర్సంపేట డివిజన్‌లోనే అత్యధికంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ ఇప్పటికే వరంగల్‌ జిల్లాకు ఆరెంజ్‌ అలర్ట్‌ను ప్రకటిం చింది. ఈ క్రమంలో సీఎం రాకపై అనుమానాలు నెల కొన్నాయి. 

Updated Date - 2021-07-24T05:55:31+05:30 IST