దేశంలోనే గొప్ప పుణ్యక్షేత్రంగా హరిహరపుర

ABN , First Publish Date - 2022-04-20T15:58:00+05:30 IST

దేశంలో ఉన్న పుణ్యక్షేత్రాల్లో హరిహరపుర పుణ్యక్షేత్రం ఒకటిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మ్తె పేర్కొన్నారు. ఆనాడు అగస్త్య మహర్షి యాగం చేసినది,

దేశంలోనే గొప్ప పుణ్యక్షేత్రంగా హరిహరపుర

                   - మహా కుంభాభిషేక మహోత్సవాల్లో సీఎం బొమ్మ్తె 


బళ్లారి(కర్ణాటక): దేశంలో ఉన్న పుణ్యక్షేత్రాల్లో హరిహరపుర పుణ్యక్షేత్రం ఒకటిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మ్తె పేర్కొన్నారు. ఆనాడు అగస్త్య మహర్షి యాగం చేసినది, లక్ష్మీనరసింహస్వామి ప్రత్యక్ష దర్శనం ఇచ్చినది, ఆదిశక్తి శంకరాచార్యులు శ్రీ శారదా పరమేశ్వరిని ప్రతిష్ఠించిన జ్ఞానభూమి అని, ఇలాంటి ఎంతో మహిమ కలిగిన పుణ్యస్థలం అన్నారు. షిమోగ జిల్లా హరిహరపురలో పరమపూజ్య శంకరాచార్య, సచ్చిదానంద సరస్వతి గురువుల ఆధ్వర్యంలో ఈనెల 10 నుంచి 24 వరకూ జరుగుతున్న మహా కుంభాభిషేక కార్యక్రమంలో మంగళవారం ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మ్తె పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ భక్తులను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ హరిహరపుర స్థల ప్రభావం చాలా మహోన్నతమైదన్నారు. ఇక్కడ నిరంతరం సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారన్నారు. హరిహరపుర పుణ్యక్షేత్రానికి దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారని తెలిపారు. సీఎంతో పాటు మఠం అడలిత అధికారి బీఎస్‌ రవిశంకర్‌, ఎమ్మెల్యే, ఎంపీలు వేదికపై పీఠాధిపతి ఆశీర్వాదం పొందారు. మంగళవారం సహస్ర చండియాగ పారాయణం, కోటి కుంకుమార్చన, ఆంజనేయస్వామి మహాయాగం నిర్వహించారు. ప్రఖ్యాత విద్యాంసులు సురమణి పండిత్‌ ప్రవీణ్‌ వేణు వాయిద్య సంగీత కార్యక్రమాలు భక్తులను అలరించాయి. కోటి కుంకుమార్చన కార్యక్రమంలో వేలాది మంది మహిళలు పాల్గొన్నారు. నిరంతరం జరుగుతున్న ధార్మిక కార్యక్రమాలకు హాజరువుతున్న భక్తులకు హరిహరపుర మఠం ద్వారా ఉచిత ప్రసాద వినియోగం చేస్తున్నారు.

Updated Date - 2022-04-20T15:58:00+05:30 IST