నెలన్నరలోగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి: Cm

ABN , First Publish Date - 2022-07-13T17:30:57+05:30 IST

రెండేళ్ల క్రితం సంభవించిన భారీ వర్షాలతో సర్వం కోల్పోయిన కొడగు జిల్లా బాధితులకు నెలన్నరలోగా ఇళ్లను అందచేయాలని ముఖ్యమంత్రి

నెలన్నరలోగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి: Cm

బెంగళూరు, జూలై 12 (ఆంధ్రజ్యోతి): రెండేళ్ల క్రితం సంభవించిన భారీ వర్షాలతో సర్వం కోల్పోయిన కొడగు జిల్లా బాధితులకు నెలన్నరలోగా ఇళ్లను అందచేయాలని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై జిల్లా అధికారిని ఆదేశించారు. తాజాగా భారీ వర్షాలతో అతలాలకుతలమైన జిల్లాలోని పలు ప్రాంతాలను ఆయన మంగళవారం పర్యటించి బాధితులను పరామర్శించారు. అనంతరం జిల్లా అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మొత్తం 195 ఇళ్ల నిర్మాణం ప్రగతిపథంలో ఉందని వీటిపై ప్రత్యేకశ్రద్ధం చూపాలని అధికారులకు సూచించారు. జిల్లా అంతటా విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ జరుగుతోందన్నారు. కొడగు జిల్లాలో పదే పదే సంభవిస్తున్న భూ ప్రకంపనలపై సెస్మిక్‌ జోన్‌లో అధ్యయనం జరగనుందన్నారు. నేషనల్‌ జియోగ్రఫిక్‌ సంస్థ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెటీరియల్‌, జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, బెంగళూరు, మైసూరు విశ్వవిద్యాలయాల విభాగాలు సంయుక్తంగా అధ్యయనం చేస్తాయన్నారు. అమృత విశ్వవిద్యాలయం ఇప్పటికే అధ్యయనం చేసి ప్రాథమిక నివేదిక అందచేసిందని సీఎం తెలిపారు. 

Updated Date - 2022-07-13T17:30:57+05:30 IST