రాష్ట్రపతి ఎన్నికల కోసమే ఢిల్లీ వచ్చా..

ABN , First Publish Date - 2022-06-24T16:17:30+05:30 IST

మంత్రివర్గ విస్తరణపై నీళ్లు చల్లినట్లయ్యింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్ళిన రోజునే ముఖ్యమంత్రి

రాష్ట్రపతి ఎన్నికల కోసమే ఢిల్లీ వచ్చా..

                        - మంత్రివర్గంపై చర్చలు లేవు: సీఎం 


బెంగళూరు, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): మంత్రివర్గ విస్తరణపై నీళ్లు చల్లినట్లయ్యింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్ళిన రోజునే ముఖ్యమంత్రి బసవరాజ్‌బొమ్మైకు పిలుపు రావడంతో మంత్రివర్గ విస్తరణ అంశమే ఉంటుందని భావించిన ఆశావహుల సంతోషం ఆవిరి అయ్యింది. గురువారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకు న్న సీఎం బసవరాజ్‌ బొమ్మై రాత్రి కర్ణాటక భవన్‌లో మీడియాతో మాట్లాడారు. శుక్రవారం రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్‌ దాఖలు కార్యక్రమంలో పాల్గొంటానన్నారు. ప్రస్తుతానికి అధిష్టానం పెద్దలు ఎవరినీ కలువలేదని తేల్చి చెప్పారు. నామినేషన్‌ ప్రక్రియ ముగిశాక ఎవరు అందుబాటులో ఉంటారనేది ఇంకా తెలియదన్నారు. అవకాశం ఉంటే అధిష్టానం పెద్దలతో పాటు కేంద్రమంత్రులతోను కలుస్తానన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా కేంద్ర మంత్రులు, ముఖ్యనేతలందరూ భాగస్వామ్యులవుతారన్నారు. విస్తరణ అంశమై ఎవరితోను చర్చలు జరిపే అవకాశం లేదన్నారు. ప్ర ధానమంత్రి నరేంద్రమోదీ బెంగళూరు పర్యటన వేళ రూ.23 కోట్లతో నిర్మించిన రోడ్లు అప్పుడే పాడైపోయిన అంశమై మీడియా ప్రశ్నకు తన దృష్టికా రాలేదని పరిశీలిస్తానన్నారు. 2024 ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు ఏర్పడుతాయనే మంత్రి ఉమేష్‌ కత్తి వ్యాఖ్యలపై స్పందించారు. ఎట్టి పరిస్థితిలోను రాష్ట్ర విభజన ఉండదని తేల్చి చెప్పారు. రాష్ట్ర విభజన అంశం ఉమేష్‌ కత్తి కొత్తగా వ్యాఖ్యానించలేదని గతంలోను మాట్లాడారన్నారు. ఉమేష్‌ కత్తిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రతిపక్షనేత సిద్దరామయ్య డిమాండ్‌ను దాటవేశారు.

Updated Date - 2022-06-24T16:17:30+05:30 IST