ఢిల్లీకి సీఎం మరోసారి వెళ్లారు.. వచ్చారు..!

ABN , First Publish Date - 2022-05-22T16:19:27+05:30 IST

ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై మరోసారి వెళ్లి వచ్చారు. మంత్రివర్గ వి స్తరణకు సంబంధించి ఎలాంటి సంకేతాలు లేకుండానే శనివారం సాయంత్రం ఆయన బెంగళూరుకు తిరిగొచ్చారు. మంత్రివర్గ

ఢిల్లీకి సీఎం మరోసారి వెళ్లారు.. వచ్చారు..!

- మంత్రివర్గ విస్తరణపై వీడని పీటముడి 

- కొలిక్కిరాని రాజ్యసభ, ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా


బెంగళూరు: ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై మరోసారి వెళ్లి వచ్చారు. మంత్రివర్గ వి స్తరణకు సంబంధించి ఎలాంటి సంకేతాలు లేకుండానే శనివారం సాయంత్రం ఆయన బెంగళూరుకు తిరిగొచ్చారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అధిష్టానం పెద్దలతో చర్చలు జరపలేదని స్పష్టం చేశారు. మంత్రి వర్గ విస్తరణ ఉంటుందా లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. గడిచిన ఐదారు నెలలుగా విస్తరణను అధిష్టానం వాయిదాలు వేస్తోంది. ప్రస్తుతం వరుస ఎన్నికలు తోడవ్వడంతో విస్తరణకు సుదీర్ఘ కాలంగా బ్రేక్‌ పడినట్టేనని తెలుస్తోంది. శుక్రవారం పలు కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ముఖ్యమం త్రి బొమ్మైను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సహా ముఖ్యనేతలు అత్యవసరంగా ఢిల్లీ రావాలని సూచించారు. విస్తరణతోపాటు రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఖరారు చేయవచ్చుననే ఉత్సాహంతో బొమ్మై ఢిల్లీ వెళ్లారు. రాత్రి పొద్దుపోయేదాకా ఆయనకు ఎటువంటి స మాచారం అందలేదు. చివరకు శనివారం కూడా అటువంటి అవకాశం రాలేదు. కేవలం ఫోన్‌లోనే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాతో చర్చించిన ముఖ్యమంత్రి బెంగళూరుకు వెనుతిరిగారు. ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి అటు అమిత్‌షాను గానీ, ఇటు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డానుగానీ నేరుగా కలవలేకపోయారు. ప్రస్తుతం నాలుగు రా జ్యసభ, 11 విధానపరిషత్‌ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటికి అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు. ఆదివారం నుంచి ఐదు రోజులపాటు సీఎం స్విట్జర్లాండ్‌లోని దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటారు. ఆయన శనివారం వెనుతిరిగి రానున్నారు. బొమ్మై ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఎన్నికలు మరో నెల రోజులపాటు కొనసాగనున్నాయి. ఆ వెంటనే బెంగళూరు పాలికె ఎన్నికల ప్రక్రియ కొనసాగించాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు ధర్మాసనం రెండు నెలల్లో రిజర్వేషన్లు, వార్డుల విభజన ముగించి ఎన్నికలు జరపాలని సూచించింది. రాజధాని బెంగళూరులో పార్టీని అధికారంలోకి తీసుకురావడం సవాల్‌గా ఉంది. మరోవైపు జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇలా నాలుగైదు నెలలు ఎ న్నికల ప్రక్రియకే సరిపోతే ఏడాది ముగిసిపోతుంది. ఆ తర్వాత మూడు నాలుగు నెలల్లోనే రాష్ట్ర శాసనసభ ఎన్నికలు సమీపిస్తాయి. ఇలా వరుస ఎన్నికలు ఉండడంతో విస్తరణ కొనసాగుతుందా..? అనేది అనుమానంగా ఉంది. ముఖ్యమంత్రి మార్పు అనే అంశం కూడా తరచూ తెరపైకి వస్తోంది. ఈ కారణంతోనే అధిష్టానం విస్తరణకు మొగ్గు చూపడం లేదా..? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం కేబినెట్‌లో ఐదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. సుదీర్ఘకాలంగా నాలుగు స్థానాలు ఖాళీగా ఉం డగా ఇటీవలే పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ మం త్రి కేఎస్‌ ఈశ్వరప్ప రాజీనామా చేయడంతో ఆ సంఖ్య 5కు చేరింది. కనీసం ఐదు బెర్తులను భర్తీ చేయాలనుకుంటే పదుల సంఖ్యలో ఆశావహులు ఉన్నారు. వారందరినీ సమన్వయ పరచడం కత్తిమీదసాములాంటిదే. 

Updated Date - 2022-05-22T16:19:27+05:30 IST