సీఎం Basavaraj Bommai ఔదార్యం

ABN , First Publish Date - 2022-06-22T16:34:31+05:30 IST

ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై మైసూరులో యోగా దినోత్సవాన్ని ముగించుకుని బెంగళూరులోని తన నివాసానికి రాగా పసికందుతో ఉన్న శంకరమ్మ

సీఎం Basavaraj Bommai ఔదార్యం

బెంగళూరు, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై మైసూరులో యోగా దినోత్సవాన్ని ముగించుకుని బెంగళూరులోని తన నివాసానికి రాగా పసికందుతో ఉన్న శంకరమ్మ అనే మహిళ సమస్యను ఆలకించారు. కుమార్తె కృష్ణవేణికి కంటి, మెదడు సంబంధ సమస్యలతో బాధపడుతోందని చికిత్సకు లక్షలాదిరూపాయలు ఖర్చు అవుతుందని ఆదుకోవాలని ముఖ్యమంత్రిని ఆమె కోరింది. వెంటనే సీఎం స్పందించి ధారవాడ ఎస్‌డీఎంకు లేఖ రాసి కృష్ణవేణికి ముఖ్యమంత్రి పరిహారనిధి కింద ఉచిత చికిత్స కల్పించాలని ఆదేశించారు. చిన్నారి పూర్తి చికిత్సకు అయ్యే బిల్లులను ప్రభుత్వమే భరిస్తుందని సూచించారు. ‘యోగా ఫర్‌ హ్యుమానిటీ’ నినాదంతో చేపట్టిన అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజునే సీఎం తన ఔదార్యాన్ని చాటుకోవడంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమయ్యాయి.



Updated Date - 2022-06-22T16:34:31+05:30 IST