Chief Minister: కల్యాణ కర్ణాటక అభివృద్ధికి కట్టుబడ్డాం

ABN , First Publish Date - 2022-09-18T17:05:19+05:30 IST

కల్యాణ కర్ణాటక అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై(Chief Minister Basavaraj Bommai) పేర్కొన్నారు.

Chief Minister: కల్యాణ కర్ణాటక అభివృద్ధికి కట్టుబడ్డాం

                                    - ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై 


బెంగళూరు, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): కల్యాణ కర్ణాటక అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై(Chief Minister Basavaraj Bommai) పేర్కొన్నారు. కలబురగిలో రూ. 18.50 కోట్ల తో నిర్మించిన పోలీస్‌ కమిషనరేట్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. కల్యాణ కర్ణాటక అమృత మహోత్సవాల్లో భాగంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కల్యాణ కర్ణాటక ప్రగతికి ప్రణాళికలు వేశామని, అభివృద్ధి చేసి చూపుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో హోంశాఖ మంత్రి ఆరగ జ్ఞానేంద్ర, కేంద్రమంత్రి భగవంత్‌ ఖూబా, రాష్ట్రమంత్రులు మురుగేశ్‌ నిరాణి, మునిరత్నతోపాటు పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వైఎస్‌ రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. సీఎం కలబురగి పర్యటన వేళ ఎస్టీ పోరాట సమితి ఆధ్వర్యంలో నల్లజెండాలను ప్రదర్శించారు. సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ విగ్రహానికి పూలమాల సమర్పించి వెనుతిరుగుతున్న వేళ సమితి ఆధ్వర్యంలో ఒక్కసారిగా నల్లజెండాలు చూపి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు 25 మంది పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2022-09-18T17:05:19+05:30 IST