మాట నిలబెట్టుకున్న CM బసవరాజ్‌ బొమ్మై

ABN , First Publish Date - 2022-01-17T18:06:04+05:30 IST

రాష్ట్రంలో ఇటీవల సంభవించిన భారీ వర్షాలకు వరదల్లో గుడిసె కూలిపోయిన వృద్ధురాలి సొంతింటి కలను ముఖ్యమంత్రి సాకారం చేసి ఇచ్చినమాటను నిలబెట్టుకున్నారు. ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై సొంత ని

మాట నిలబెట్టుకున్న CM బసవరాజ్‌ బొమ్మై

                      - కమలవ్వ సొంతింటి కల సాకారం 


బెంగళూరు: రాష్ట్రంలో ఇటీవల సంభవించిన భారీ వర్షాలకు వరదల్లో గుడిసె కూలిపోయిన వృద్ధురాలి సొంతింటి కలను ముఖ్యమంత్రి సాకారం చేసి ఇచ్చినమాటను నిలబెట్టుకున్నారు. ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై సొంత నియోజకవర్గం హావేరి జిల్లా షిగ్గావ్‌లోని మంచినకొప్ప గ్రామానికి చెందిన కమలవ్వ అనే వృద్ధురాలు ఇటీవల సీఎంకు తన గోడును వెళ్లబోసుకుంది. తన ఇద్దరు కుమారులూ చనిపోయారని, వరదల్లో ఉన్న గుడిసె కాస్తా కొట్టుకుపోయిందని, నిలువనీడలేని బతుకు నాయనా, సొంతింటిని నిర్మించుకోలేనంటూ సీఎం వద్ద వాపోయింది. వృద్ధురాలి కష్టానికి చలించిపోయిన సీఎం పక్కా ఇంటిని నిర్మించి ఇస్తానని, సంక్రాంతి పండుగను సొంతింటిలోనే చేసుకుందువు గానీ అంటూ భరోసా ఇచ్చారు. ఇచ్చినమాట మాట ప్రకారం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించి కమలవ్వకు సొంతింటిని కేవలం నాలుగునెలల్లోనే నిర్మించిన అధికారులు అప్పగించగా శనివారం పాలుపొంగించి సంక్రాంతి వేడుక జరుపుకుంది. ఇంట్లో సీఎం బొమ్మై ఫొటోను పెట్టుకుని పూజిస్తానని చెప్పింది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎంను మనసారా ఆశీర్వదించింది.

Updated Date - 2022-01-17T18:06:04+05:30 IST