ఎస్సీ, ఎస్టీలపై సీఎం వరాల జల్లు

ABN , First Publish Date - 2022-04-06T18:02:43+05:30 IST

మాజీ ఉపప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్‌ 115వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలు మంగళవారం ఘనంగా నివాళులర్పించారు. విధానసౌధ వద్ద జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి ముఖ్యమంత్రి

ఎస్సీ, ఎస్టీలపై సీఎం వరాల జల్లు

బెంగళూరు: మాజీ ఉపప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్‌ 115వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలు మంగళవారం ఘనంగా నివాళులర్పించారు. విధానసౌధ వద్ద జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై పుష్పాంజలి ఘటించారు. ఇదే సందర్భంగా జగ్జీవన్‌రామ్‌ పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీఎం పలు వరాలు ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా నిర్ణీత ప్రమాణంలో విద్యుత్‌ వాడుకునే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. భూమిపై హక్కులు పొందేందుకు ప్రస్తుతం ఈ వర్గాలకు ఇస్తున్న సబ్సిడీని రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచాలని తీర్మానించామన్నారు. ఎస్సీ ఎస్టీల ఇళ్ల నిర్మాణానికి మంజూరు చేస్తున్న రూ.1.75 లక్షల సబ్సిడీని రూ.2 లక్షలకు పెంచుతున్నామన్నారు. అన్ని తాలూకాల్లోనూ జగ్జీవన్‌రామ్‌ స్వయం ఉపాధి పథకాలను అమ లు చేసే దిశలో ప్రణాళిక సిద్ధమవుతోందని, మరో నెలలో దీన్ని అమలు చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాలలో కుటీర పరిశ్రమలు నిర్వహించే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 75 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ను అందచేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో ప్రత్యేక శిక్షణ తరగతులను ప్ర స్తుత ఏడాది నుంచే ప్రారంభిస్తామన్నారు. ము ఖ్యమంత్రి మార్గదర్శిని వేదిక ద్వారా 8-12 తరగతి విద్యార్థులకు ఈ శిక్షణ లభిస్తుందన్నారు. ఈ వర్గాలకు చెందిన యువత స్టార్ట్‌పలు ప్రారంభించేందుకు ముందుకు వస్తే రూ.50 లక్షల వరకు సబ్సిడీని ఇప్పటికే బడ్జెట్‌లో ప్రకటించామన్నారు. ఎస్సీ, ఎస్టీలు సామాజిక, ఆర్థిక స్వావలంబన సాధించే దిశలో ప్ర భుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ఇదే సందర్భంగా వివిధ రంగాలలో గణనీయ సేవలందిస్తున్న ప్రముఖులకు ఆయన డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ పురస్కారాలను ప్రదానం చేసి సన్మానించారు. కాంగ్రెస్‌, బీజేపీ, జేడీఎస్ ఆధ్వర్యంలోనూ జగ్జీవన్‌రామ్‌ జయంతి కార్యక్రమాలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా అ న్ని జిల్లా, తాలూకా కేంద్రాలలో ఆయనకు ఘనంగా ని వాళులర్పించారు.

Updated Date - 2022-04-06T18:02:43+05:30 IST