నేడు Delhiకి సీఎం

ABN , First Publish Date - 2022-07-22T16:33:49+05:30 IST

ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై శుక్రవారం మధ్యాహ్నమే ఢిల్లీకి బయల్దేరి వెళుతున్నారు. రాష్ట్రపతి రామనాధ కోవింద్‌కు వీడ్కోలు

నేడు Delhiకి సీఎం

                              - రాష్ట్రపతి వీడ్కోలులో పాల్గొననున్న బొమ్మై


బెంగళూరు, జూలై 21 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై శుక్రవారం మధ్యాహ్నమే ఢిల్లీకి బయల్దేరి వెళుతున్నారు. రాష్ట్రపతి రామనాధ కోవింద్‌కు వీడ్కోలు పలికేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఇస్తున్న విందుకు సీఎం హాజరవుతారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు గురువారం వెల్లడించాయి. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఒకవేళ శుక్రవారం అధిష్టానం పెద్దలతో చర్చించేందుకు వీలు పడకపోతే ఈనెల 24న ఆయన మళ్ళీ ఢిల్లీకి వెళతారని ిసీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. 

Updated Date - 2022-07-22T16:33:49+05:30 IST