నగరంలోని పలు ప్రాంతాల్లో Cm ఆకస్మిక పర్యటన

ABN , First Publish Date - 2022-06-15T16:58:20+05:30 IST

ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై మంగళవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా అభివృద్ధి కార్యక్రమాల

నగరంలోని పలు ప్రాంతాల్లో Cm ఆకస్మిక పర్యటన

బెంగళూరు, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై మంగళవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిని స్వయంగా పరిశీలించారు. రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌కు హెచ్‌ఏఎల్‌ వీఐపీ విమానాశ్రయంలో ఘనంగా వీడ్కోలు పలికిన అనంతరం తన నివాసానికి చేరుకోవాల్సి ఉన్న సీఎం హఠాత్తుగా మారతహళ్లి, బెళ్లందూరు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. మారతహళ్లిలో తొలుత అండర్‌పాస్‌ పనులను ఆయన పరిశీలించారు. వర్షాకాలం ప్రారంభయ్యే సూచనలు ఉన్నాయని, త్వరంగా పనులు పూర్తిచేయాలని అధికారులకు ఆయన సూచించారు. అనంతరం బెళ్లందూరులో జరుగుతున్న తారురోడ్డు పనులను వాటి నాణ్యతను పరిశీలించారు.

Updated Date - 2022-06-15T16:58:20+05:30 IST