తాళాలిస్తారని వెళ్తే సీఎం భజన!

ABN , First Publish Date - 2022-07-01T09:12:04+05:30 IST

తాళాలిస్తారని వెళ్తే సీఎం భజన!

తాళాలిస్తారని వెళ్తే సీఎం భజన!

పెద్దాపురంలో టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల అసహనం

పెద్దాపురం, జూన్‌ 30: టిడ్కో గృహాలను లబ్ధిదారులకు పంపిణీ చేసే కార్యక్రమం కాకినాడ జిల్లా పెద్దాపురంలో చప్పగా సాగింది. పట్టణ శివారు వాలుతిమ్మాపురం రహదారిలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మొదటి ఫేజ్‌లో నిర్మించిన 1,728 గృహ సముదాయాలను లబ్ధిదారులకు అందించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఆదిమూలం సురేశ్‌ హాజరయ్యారు. ఇప్పటికే ఒకసారి ఈ కార్యక్రమం వాయిదాపడడంతో ఈసారైనా తాళాలు అందిస్తారని లబ్ధిదారులు ఆశగా ఎదురుచూశారు. సభ ప్రారంభం నుంచి ప్రతి నాయకుడూ ముఖ్యమంత్రికి భజన చేయడమే పనిగా పెట్టుకోవడంతో విసుగుచెందారు. అప్పటికే మూడు గంటల నుంచి వేచి చూస్తున్న లబ్ధిదారులు వారి ప్రసంగాలతో అసహనం వ్యక్తం చేశారు. మంత్రి సురేశ్‌ ప్రసంగిస్తుండగా మధ్యలోనే వెళ్లిపోయారు. దీంతో ప్రాంగణం వెనుకభాగమంతా ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. లబ్ధిదారులను పోలీసుల సహాయంతో ఆపే ప్రయత్నం చేసినా వారు ఆగలేదు. 


Updated Date - 2022-07-01T09:12:04+05:30 IST