ఆ ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు: సీఎం

ABN , First Publish Date - 2021-11-20T18:25:04+05:30 IST

భారీ వర్షాల కారణంగా అతలా కుతలంగా మారిన జిల్లాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులకు ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ఆదేశాలు జారీ చేశారు. తన అధికార నివా

ఆ ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు: సీఎం

బెంగళూరు: భారీ వర్షాల కారణంగా అతలా కుతలంగా మారిన జిల్లాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులకు ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ఆదేశాలు జారీ చేశారు. తన అధికార నివాసం కృష్ణలో శుక్రవారం ఆయన జిల్లా అధికారులు, జిల్లా పంచాయతీ సీఈఓలతోనూ వీడియో సదస్సు నిర్వహించారు. జిల్లాల వారీగా తాజా స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. వర్షపీడిత జిల్లాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. వాతావరణ శాఖ మరో వారం పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిందని కాగా సభ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వర్షం కారణంగా పలు జిల్లాల్లో రైతులకు అపార పంటనష్టం సంభవించిందని అందరినీ ఆదుకుంటామని చెప్పారు. 

Updated Date - 2021-11-20T18:25:04+05:30 IST