ఎమ్మెల్సీ ఎన్నికల్లో... బీజేపీ విజయం ఖాయం

ABN , First Publish Date - 2021-11-19T18:44:03+05:30 IST

స్థానిక సం స్థలనుంచి విధానపరిషత్‌కు జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం తథ్యమని ముఖ్యమంత్రి బసవరాజ్‌బొమ్మై అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కొప్పళలో గురువారం ఏర్పాటైన

ఎమ్మెల్సీ ఎన్నికల్లో... బీజేపీ విజయం ఖాయం

- ప్రతిపక్షాల దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి  

- ‘జనస్వరాజ్‌’ యాత్రలో సీఎం 


బెంగళూరు: స్థానిక సం స్థలనుంచి విధానపరిషత్‌కు జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం తథ్యమని ముఖ్యమంత్రి బసవరాజ్‌బొమ్మై అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కొప్పళలో గురువారం ఏర్పాటైన ‘జనస్వరాజ్‌’ యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రణరంగ బాకా ఊదారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం బలంగా ఉంటుందన్నారు. విధానపరిషత్‌లో బీజేపీకి పరిపూర్ణ మెజారిటీ లభిస్తే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం సులభతరం అవుతుందన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలు, ప్రలోభాలకు లొంగకుండా బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని స్థానిక సంస్థల సభ్యులకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌ మాట్లాడుతూ పరిషత్‌ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అభ్యర్థులను బరిలోకి దింపుతున్నామన్నారు. 25 స్థానాలకుగాను మెజారిటీ స్థానాలను బీజేపీ కైవశం చేసుకోవడం ఖాయమన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బీజేపీ అధ్వర్యంలో ‘జనస్వరాజ్‌’ యాత్రలు జరిగాయి.

Updated Date - 2021-11-19T18:44:03+05:30 IST