Cm Bommaiకి ప్రధాని శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2022-01-29T13:27:21+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై 62వ జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఉదయం ప్రధాని ఫోన్‌ ద్వారా బొమ్మైకు శుభాకాంక్షలు తెలిపినట్టు సీఎం

Cm Bommaiకి ప్రధాని శుభాకాంక్షలు

బెంగళూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై 62వ జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఉదయం ప్రధాని ఫోన్‌ ద్వారా బొమ్మైకు శుభాకాంక్షలు తెలిపినట్టు సీఎం కార్యాలయం ప్రకటించింది. ముఖ్యమంత్రిగా ఆరు నెలల పాలనపైనా ప్రధాని ప్రత్యేకంగా ప్రశంసించినట్టు పేర్కొంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఫోన్‌చేసి బొమ్మైకు శుభాకాంక్షలు తెలిపారు. జన్మదిన సందర్భంగా ఆర్‌టీనగర్‌లోని ఆయన నివాసం వద్ద బొమ్మై దంపతులు గోపూజ చేశారు. అనంతరం యడియూరప్ప నివాసానికి వెళ్లి ఆశీస్సులు పొందారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌ సహా పలువురు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత విధానసౌధలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనగా మంత్రులు సుధాకర్‌, సోమణ్ణ, గోపాలయ్య, ప్రభుచౌహాన్‌, ఎస్‌టీ సోమశేఖర్‌, బీసీ నాగేశ్‌, బైరతి బసవరాజ్‌, గోవింద కారజోళ సహా పలువురు అభినందించారు. హుబ్బళ్లిలో కర్ణాటక మ్యాప్‌లో బొమ్మైతో కూడిన చిత్రం ఆకర్షించింది. 

Updated Date - 2022-01-29T13:27:21+05:30 IST